నా తల్లి దండ్రులు, భార్య పిల్లలు ఉన్నారు. నాకు వారి యందు అత్యంత ప్రేమ ఉండడం సాధారణం.
పొద్దున్నే లేచి నేను ప్రేమించి నాకుటుంబ సభ్యులు అని ఓ సారి తలుచుకుని లేదా వాళ్ళ మొహాలు చూసి నాపనులకి నేను వెళ్ళిపోతే. సరే గొప్ప ఉపమానం కాకపోయినా నా భార్యను చూసి ప్రేమ పొంగి ఓ పండగకి చీర కొనుక్కుంటుంటే ఒకటెందుకు రెండుకొనుక్కో ఆ ఫలానా రంగుచీర నీకు భలే నప్పుతుంది తెలుసా అని అడగకపోయినా కొనిస్తాను అనుక్కుందాం. అలాగే ఏదో తనకి నచ్చిన నాలుగు స్వీట్లు గట్రా కొనిచ్చి ఓ షాపింగ్ మాల్కి తీసుకెళ్ళి తనకి నచ్చినవేవో కొనిచ్చి, ఎప్పుడూ బండేనా అని ఫ్రెండ్ దగ్గర కారు తీసుకొని ఇవన్నీ కొనడానికి నా భార్యను తీసుకెళితే అది ప్రేమ వల్లనే కదా.
నాకిష్టమైన స్నేహితుడు ఒ రోజుండడానికి ఇంటికొస్తే కాళ్ళు కడుక్కోమని బాత్రూమ్ చూపి, నీళ్ళిచ్చి, కాఫీ ఇచ్చి, తరవాత స్నానానికి నీళ్ళు పెట్టి, నేను వాడేది కాక ఎప్పుడైనా పండగలకి వాడే మంచి షాంపూ ఇచ్చి, నువ్వు తెచ్చుకున్న బట్టలెందుకురా అని ఓ మంచి పంచో/ లుంగీయో -టి షర్టో ఇచ్చి, భోజనం పెట్టి, చెయ్యికడుక్కోడానికి నీళ్ళు తుడుచుకోడానికి తువ్వాలు ఇచ్చి. అయ్యాక వక్కపలుకులో తాంబూలమో ఇచ్చి మధ్యాహ్నం పడుక్కోమని పక్కేసి లేచాక టీ ఇచ్చి వాడి పని మీద బయటికెళ్ళి పనయ్యాక ఊరికి బయలుదేరుతుంటే సాగనంపడం.. వీటన్నిటినీ ఎవడైనా ప్రహసనం అంటాడా?
నాకిష్టమైన స్నేహితుడు ఒ రోజుండడానికి ఇంటికొస్తే కాళ్ళు కడుక్కోమని బాత్రూమ్ చూపి, నీళ్ళిచ్చి, కాఫీ ఇచ్చి, తరవాత స్నానానికి నీళ్ళు పెట్టి, నేను వాడేది కాక ఎప్పుడైనా పండగలకి వాడే మంచి షాంపూ ఇచ్చి, నువ్వు తెచ్చుకున్న బట్టలెందుకురా అని ఓ మంచి పంచో/ లుంగీయో -టి షర్టో ఇచ్చి, భోజనం పెట్టి, చెయ్యికడుక్కోడానికి నీళ్ళు తుడుచుకోడానికి తువ్వాలు ఇచ్చి. అయ్యాక వక్కపలుకులో తాంబూలమో ఇచ్చి మధ్యాహ్నం పడుక్కోమని పక్కేసి లేచాక టీ ఇచ్చి వాడి పని మీద బయటికెళ్ళి పనయ్యాక ఊరికి బయలుదేరుతుంటే సాగనంపడం.. వీటన్నిటినీ ఎవడైనా ప్రహసనం అంటాడా?
ఓకే... ఏదో ప్రపంచంలో ఎవరికీ భార్యలు, ప్రేయసిలు, పిల్లలు, తల్లి దండ్రులు, అన్నదమ్ములు లేనట్ట్లు ఫోన్లో గంటలు గంటలు సొల్లు కబుర్లు దానికి సెల్లు బిల్లులు. ఎంత షాపింగ్ ఖర్చు, ఎంత వేస్టేజి... కాదు ఖచ్చితంగా కాదు, అది నా కుటుంబంమీద నా స్నేహితులమీద నావాళ్ళనుక్కున్నవాళ్ళ మీద నాలో ఉన్న ప్రేమ ప్రకటనం.... నీ భార్యకి పట్టుచీర కొన్నావ్ దాంతో ఆ షాప్ ఎదురుగా ఉన్నవారికి యాచకురాలికి ఒక చీర ముక్క కొనివ్వలేదేమని ఎవరైనా ప్రశ్నిస్తారా? అలా ప్రశ్నించిన వాణ్ణి ఏమంటాం... కాస్త తేడా చేసిందా, బుర్ర పనిచేస్తోందాలేదా దిమాగ్ గుట్నేమే హైక్యా అని అడుగుతాం... కదూ...
ప్రేమ ఉన్నచోట దాని వ్యక్తీకరణ చేతలలో చూపబడుతుంది, తనకుందా లేదా తరవాత సంగతి అన్నీ ఆలోచనలుండవు. తనకున్నదాంట్లో గొప్పది ఇచ్చుకోవాలన్న తపన, ఆ ప్రేమించబడ్డ వ్యక్తి బాగోగులు చూడడం. ఒంట్లోబాలేకపోతే దగ్గరగా ఉండి ఒకటికి రెండుసార్లు కనుక్కోవడం, ఉపచారాలు చేయడం సర్వ సాధారణం. నా ప్రేమ పొందిన నా కుటుంబ సభ్యులు ఏబాధ పడ్డా లేదా సుఖపడ్డా నలుగురికి చెప్పుకుంటాను, మనసులో తలుస్తూ ఉంటాను, చేతలలోనూ చూపిస్తుంటాను. అంటే ప్రేమిస్తే త్రికరణ శుద్ధిగా చేస్తాను. మనసుతో భావిస్తాను, శరీరంతో వారిని మెప్పించే పని చేస్తాను, నోటితో ప్రేమగా మాట్లాడతాను. ఇదేగా త్రికరణశుద్ధి అంటే. ప్రేముంటే ఇవన్నీ చేయాలా? మనసులో ఉంటే చాలదా. రోజూ పొద్దున్నే లేవగానే నిస్వార్థంగా ఈమె నాభార్య అని తలుచుకుంటే సరికాదా?
ఈ మధ్య చాలా చోట్ల ప్రతి ఒక్కడి దగ్గర భగవంతుడి గురించిన భక్తి గురించి వినేదేమంటే నిస్వార్థంగా మనసులో దండం పెట్టుకుంటే చాలదా భక్తిగా ఉంటే చాలదా ఈ పూజలూ వ్రతాలు ఎట్సెట్రా ఎందుకూ అని... హుమ్మ్.. అవును అలా ఎందుకు అనేది కాస్త పక్కన బెడదాం.
అసలు భక్తి ఎందుకు అని ప్రశ్నిద్దాం? భక్తి అంటే ఏమిటో మనకి భక్తి సూత్రాలు వాఙ్మయం పరిశీలన అవసరం లేదు కానీ, అంత ఓపికా తీరికా ఔట్డేటెడ్ సిలబస్ మనకవసరామా స్థితి మనది కదా.... సామాన్యార్థంలో నాకన్నా ఉన్నతుడైనవాని యందు ఉప్పొంగిన ప్రేమ ప్రకటనమే నా భక్తి కదా!! ఉత్తమమైన ప్రేమే కదా భక్తి.
నాకు నా తల్లిదండ్రులద్వారా జన్మనిచ్చి ఏలోపం లేని శరీరమిచ్చి ప్రేమించే కుటుంబ సభ్యులనిచ్చి, స్నేహితులనిచ్చి, బంధువులనిచ్చి. నాక్కావలసింది నాకు సమకూరుస్తూ. తిన్నదరిగిస్తూ, నిద్రనిస్తూ, తిరిగి తినడానికి ఆకలిని దాన్ని తీర్చడానికి తిండిని ఇస్తూ ఇంకా చెప్పాలంటే ఊపిరి తీయనిస్తూ వదలనిస్తూ ఎన్నో విధాల ప్రతి కదలికలోనూ విషయంలోనూ అందరికన్నా అతి దగ్గరగా ఉండి నేను ప్రేమించే నావాళ్ళకన్నా నన్ను ప్రేమించి ఒడిసి పట్టుకుని కాచే భగవంతుని యందు నా ప్రేమ హెచ్చడం, దాని ప్రకటనం చేయడం వ్యక్త పరచడం తప్పెలా? తద్విషయంలో ఉపచారం చేయడం ఎలా తప్పా? అంతటా నిండి ఉన్న భగవంతుని గుర్తుగా ఒక రూపంలో ఒక ప్రదేశంలో నాకు నచ్చిన ఒక ఆకారంలో చూసుకొని ప్రేమతో ఉపచారం చేయడం ఎలా తప్పు. నా వాళ్ళనుక్కున్నవారందరికన్నా అతి దగ్గరవాడు నాకు భగవంతుడు. నీకాయన కనపడకపోతే నీ దృష్టిలోపం అది. అంత మాత్రాన ఆయనకొరకు నేను చేసే ఉపచారాలు తప్పని నీ ఇష్టం వచ్చినట్లు ఎలా మాట్లాడగలవు. తల్లిదండ్రులు దగ్గర లేకుండా ఊళ్ళో ఉండి నీక్కనపడకపోతే ఎంతొస్తే అంత ఏం తోస్తే అది మాట్లాడవు కదా? అలా మాట్లాడే మూర్ఖులుంటే వారు కలవాల్సింది మానసిక రుగ్మతలు తొలగించే వైద్యుని.
ప్రేమ/భక్తి ఉన్నచోట ప్రకటరూపంగా వ్యక్తపరచడం ఉంటుంది. కేవలం మనసులో తలచుకుని కూర్చోడం కుదరనే కుదరదు. ఒకవేళ అలా ఉంటే అది స్థిరీకరింపని డోలాయమానమైనది ప్రేమ/ భక్తి. లేదా మరే కారణానికో (భయంతోనో, లోభంతోనో, మోహంతోనో) ప్రేమలా కనపడేదికానీ ప్రేమ లేదా భక్తి కానేరదు. భక్తి ఎప్పుడూ త్రికరణశుద్ధితో ఉంటుంది. మానసికంగా, కాయికంగా, వాచికంగా...
Very good post sir
ReplyDeleteస్వాగతం శశి గారూ... మీ మెచ్చుకోలుకి ధన్యవాదాలు
Deleteఅరటిపండు ఒలిచి పెట్టినట్లు చెప్పారండీ.
ReplyDeleteస్వాగతం మిస్సన్న గారూ... మీ మెచ్చుకోలుకి ధన్యవాదాలు
Delete
ReplyDeleteచ చ చ ! ఆ లాస్ట్ పదం అనుకుందాం తో మూడే పోయిందండి ! .... <<< నా భార్యను చూసి ప్రేమ పొంగి ఓ పండగకి చీర కొనుక్కుంటుంటే ఒకటెందుకు రెండుకొనుక్కో ఆ ఫలానా రంగుచీర నీకు భలే నప్పుతుంది తెలుసా అని అడగకపోయినా కొనిస్తాను అనుక్కుందాం.
ఆ ఎంత మంచి వారు అనుకున్నా ఆ అనుకుందాం పదం చదివెంత దాకా !!
జిలేబి
నమస్తే
Delete:D ’అనుక్కుందాం’ కేవలం దీనికే పరిమితం... నిజంగా ఐతే అనుక్కోవడాల్లేవ్ ఓన్లీ కొనేసుకోవడాలే...
ఆల్రెడీ ఈ కార్యక్రమం ప్రతి సారి షాపింగ్ కీ జరిగిపోతుంది... సో నిజంగా నేను మంచివాణ్ణే... :D
ఇది వ్రాసిన రోజే సంక్రాంతి షాపింగ్ కి జరిగింది కూడానూ