శ్రీ గురుభ్యోనమః
నమస్తే
ఉపదిశతి య దుచ్చైర్జ్యోతి రామ్నాయ విద్యాం
పర మవర మదూరం దూర మాద్యంతశూన్యం !
త్రిపురజయిని తస్మిన్ దేవదేవే నినిష్టా
భగవతి పరివర్తోన్మాథినీ భక్తి రస్తు !!
ఏ శివజ్యోతిస్సు సర్వోత్తమ జ్ఞానమగు ఆమ్నాయ విద్యను
జనులకు ఉపదేశిస్తున్నదో, ఏది అన్నిటికంటెను పెద్దదైన,
అన్నిటికంటే చిన్నదిగా అవుతున్నదో, ఏది చాలా దూరముగా
ఉన్నదో, ఏది అత్యంత సమీపముగా ఉన్నదో ఏతత్త్వమునకు ఆదియు అంతమును
లేవో, అట్టి త్రిపురవిజయుడగు దేవదేవుడే శివుడు. ( అవిద్య,
కామ, కర్మములు అనే సంసార బీజమును నాశము చేయువాడు
లేదా జ్ఞాతృ-జ్ఞేయ-జ్ఞాన నామక త్రిపుటిని లయముచేసి తన ఉపాసకులకు విమలమైన జ్ఞానాత్మక
తత్త్వమును అనుగ్రహించువాడు అని అర్థము) అట్టి భగవానుని విషయంలో నాకు ఎన్నడూ లేశమాత్రమైన
మార్పు చెందని స్థిరభక్తి ప్రతిష్టించబడుగాక.
సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు
No comments:
Post a Comment