Pages

Sunday, April 14, 2019

నా గమ్యం నిశ్చలానందం!

నా గమ్యం నిశ్చలానందం,

నడత మొదలైన నాటినుండి నడుస్తూనే ఉన్నా..
కందపడీ, పైకి లేచి, పక్కన కూర్చుని చేరగిలపడి, గమ్యం అదికాదని యెరిగి.. రివ్వున మొదలై..

చలివేంద్రాలు, పూటకూళ్ల ఇళ్ళు, దారితప్పించే కూడళ్లు, మజిలీలు ఎన్నో ఎన్నెన్నో..

నడత మొదలైన నాటినుండి నడుస్తూనే ఉన్నా..

మొదట నిల్చిన తోడు ఇప్పుడు లేదు, ఇప్పటితోడు ఏనాటివరకో, కొత్త స్నేహాలెంతవరకో..

బాటలో భవనాలు కట్టినా, వనాల కూర్చినా, బస్తాలు మోసినా.. గమ్యం అదికాదని యెరిగి.. రివ్వున మొదలై..

నడత మొదలైన నాటినుండి నడుస్తూనే ఉన్నా..

సాయమొంది సాచి కొట్టినవారెందరో.. నడిచే కాళ్లలో కఱ్ఱ దూర్చినవారెందరో... నేడెందరో..  రేపటికింకెందరో..

కూటి కోసం, కూలి కోసం, కీర్తి కోసం, మందకోసం, స్వార్థ చింతనలో వ్యక్తిత్వం వీపున తన్నిన వారెందరో...

ఐనా..  నడత మొదలైన నాటినుండి నడుస్తూనే ఉన్నా..

ప్రభూ! నువ్వున్నావనే నమ్మికతో, గమ్యం చేరుస్తావనే పూనికతో,

అనితర సాధ్యమైన నువ్వే.. నా గమ్యం.

నా గమ్యం నిశ్చలానందం,

-శంకరకింకర:

No comments:

Post a Comment