Pages

Monday, March 4, 2019

శివరాత్రి ప్రార్థన



శివరాత్రివ్రతం వక్ష్యే భుక్తిముక్తిప్రదం శృణు !
మాఘఫాల్గునయోర్మధ్యే కృష్ణా యా తు చతుర్దశీ !!1
కామయుక్తా తు సోపోష్యా కుర్వన్‌ జాగరణం వ్రతీ !
శివరాత్రివ్రతం కుర్వే చతుర్దశ్యామభోజనమ్‌!! 2
రాత్రిజాగరణేనైవ పూజయామి శివం వ్రతీ !
ఆవాహయామ్యహం శమ్భుం భుక్తిముక్తిప్రదాయకమ్‌!! 3
నరకార్ణవకోత్తారనావం శివ నమోస్తుతే !
నమః శివాయ శాన్తాయ ప్రజారాజ్యాదిదాయినే!! 4
సౌభాగ్యారోగ్య విద్యార్థస్వర్గమార్గప్రదాయినే !
ధర్మం దేహి ధనం దేహి కామభోగాది దేహి మే!! 5
గుణకీర్తిసుఖం దేహి స్వర్గం మోక్షం చ దేహి మే !
లుబ్దకః ప్రాప్తవాన్‌ పుణ్యం పాపీ సున్దరసేనకః!! 6
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే శివరాత్రివ్రతం నామ త్రినవత్యధిక శతతమోధ్యాయః!!
-శంకరకింకర
శివరాత్రి ఉపవాసముండి రాత్రి జాగరము చేసి ఇట్లు కోరవలెను ''నేను చతుర్దశినాడు ఉపవాసముండి శివరాత్రి వ్రతము చేయుచుంటిని. నేను వ్రతముక్తుడనై రాత్రి జాగరము చేసి శివుని పూజ చేయుచున్నాను. భోగమోక్షములను ప్రసాదించు శివుని ఆవాహనము చేయుచున్నాను. శివా! నీవు సంసారనరకసముద్రమును దాటించు నౌకవంటివాడవు. నీకు నమస్కారము. నీవు సంతానమునురాజ్యమును ఇచ్చువాడవు. మంగళమయుడవు. శాంతస్వరూపుడవు. నీకు నమస్కారము. నీవు సౌభాగ్య - ఆరోగ్య - విద్యా - ధన - స్వర్గముల నిచ్చువాడవు. 

నాకుధర్మమునుధనమునుకామభోగాదులను ప్రసాదించుము. నన్ను గుణ - కీర్తి - సుఖసంపన్నునిగా అనుగ్రహించుము. దేహాంతమున నాకు స్వర్గ - మోక్షముల నిమ్ము''  - అగ్నిమహాపురాణము- శివరాత్రివ్రతము 193వ అధ్యాయము






No comments:

Post a Comment