శ్రీ గురుభ్యోనమః
జై గురు దత్త
జనామోదానికి దత్తావతారం అని వాడుక తప్ప ఆచరణకి కాదా? దత్తుడు చెప్పిందే ఆచరించకపోతే ఇంకెందుకు ఆయన పేరు వాడుకోవడం.
శ్రీ బ్రహ్మాండ పురాణాంతర్గత శ్రీ దత్త
మాహాత్మ్యం - చతుర్థ అంశః చతుర్ధశాధ్యాయః (శ్రీ గురు చరిత్ర అరవై ఒకటవ అధ్యాయము
నుండి).
శౌచాచారవిహీనస్య సమస్తం
కర్మ నిష్ఫలమ్!!
శౌచం తు ద్వివిధం
ప్రోక్తం బాహ్యమభ్యంతరం తథా !
మృజ్జలాభ్యాం బహిః శుద్ధిః భావశుద్ధిస్తథాంతరమ్ !!
స్వయం శ్రీ దత్తాత్రేయులవారు ధర్మాన్ని ఉపదేశిస్తూ శౌచం లేని కర్మ నిష్ఫలం అని
చెప్తుంటే,
శౌచం పాటించకుండా అదేదో నీరు దొరకని అరబ్బు దేశవాసులలాగా
శౌచం పాటించకుండా దత్తావతారాలు దత్త పరంపరలోని గురుపరంపర అని పిలవబడే మందిరాలకీ, సంస్థానాలకి శౌచం లేకుండా ఎలా వెళ్తున్నారు? పూజాదులు ఎలా నిర్వహిస్తున్నారు? ధర్మకర్తలు, పురోహితులెలా అనుమతిస్తున్నారు?
కేవలం విస్తృతజనామోదానికి దత్తావతారం అని వాడుక తప్ప ఆచరణకి కాదా? దత్తుడు చెప్పిందే ఆచరించకపోతే ఇంకెందుకు ఆయన పేరు వాడుకోవడం.?
నిత్యం స్యాధ్యాయశీలః స్యాత్ యథాచారం సమాశ్రయేత్!...
నారోహేద్దుష్టయానం చ
శుష్కవాదం చ వర్జయేత్!
అన్యస్త్రీయం న
గచ్ఛేచ్చ పైశున్యం పరివర్జయేత్!!...
న దుర్జనైః సహ వసేత్ నాశాస్త్రం శృణుయాత్తధా!
ఆసవద్యూతగీతేషు నరః ప్రీతింవివర్జయేత్ !!
నిత్యమూ స్వాధ్యాయము (వేదము, పురాణేతిహాసాలు) ఆచారనియమాలు పాటించాలి, దుష్టమార్గములో వెళ్లవద్దు, శుష్కవాదం చేయవద్దు,
పరస్త్రీలవద్దకు వెళ్ళవద్దు...
దుర్జనులతోటి కలిసి ఉండరాదు, అశాస్త్రమైన
వాటిని వినరాదు అని దత్తుడే చెప్తుంటే వేదశాస్త్రాలు వద్దని అవధూతపరంపరలో ఉన్నామని
చెప్పేవారెలా చెప్తున్నారు.
పంచయజ్ఞపరిత్యాగీ బ్రహ్మహేత్యుచ్యతే బుధైః!
కుర్యాదహరహస్తస్మాత్ పంచయజ్ఞాన్ప్రయత్నతః !!
దేవయజ్ఞో భోతయజ్ఞః పితృయజ్ఞ సథైవ చ !
నృయజ్ఞో బ్రహ్మయజ్ఞశ్చ పంచయజ్ఞాః ప్రకీర్తితాః!!
అవధూతలకే అవధూత మహా అవధూతా
ఐన శ్రీ దత్తాత్రేయులవారు స్వయంగా ధర్మాన్ని
ఉపదేశిస్తూ వేద విహితమైన పంచయజ్ఞములనాచరించమని, ప్రతి ఒక్కరూ
ప్రయత్న పూర్వకంగా వాటినాచరించాలని చెప్తూంటే. వేద విహిత కర్మలవసరంలేదనీ,
అవన్నీ వేర్వేరు మార్గాలనీ, దత్తావతారాలు దత్త
పరంపరలోని గురుపరంపర అని చెప్పుకుని దత్తుడు చెప్పినదానికి వ్యతిరిక్తంగా ఎలా అవైదికాన్ని
ఎలా ప్రచారం చేసి ప్రోత్సహిస్తున్నారు? ముఖ్యంగా ధర్మం చెప్పాల్సిన
పురోహితాదులు వారి పంచ ఎలా చేరి ధర్మ భ్రష్టం, కర్మ భ్రష్టం,
ఆచార భ్రష్టం చేయిస్తున్నారు.
బ్రాహ్మణ క్షత్రియవిశాం శూద్రాణాం చైవ యోషితామ్ !
మోక్షదం కుర్వతాం భక్త్యా విష్ణోః ప్రియతరంమునే !!
ఏకాదశీవ్రతం
నామ సర్వకామఫలప్రదమ్ !
కర్తవ్యం సర్వదా విప్రైః విష్ణుప్రీణనకారణమ్ !!
ఏకాదశ్యాం న భుంజీత పక్షయోరుభయోరపి !
యది భుంక్తే స
పాపీ స్యాత్ పరత్ర నరకం ప్రజేత్ !!
నాలుగు వర్ణాలవారూ ఏకాదశీ వ్రతం చేయాలనీ, దానివల్ల మోక్షార్హత
కలుగుతుందనీ శుక్లకృష్ణ పక్షాలు రెంటిలోనూ ఏకాదశీ ఉపవాసం చేయాలని శ్రీ దత్తాత్రేయులవారు
చెప్తే… దత్తపరంపర, దత్తావతారం అని కొలిచే
వారు ఉపవాసం చేయవద్దు అని చెప్పారని తప్పు ప్రచారం ఎలా చేస్తున్నారు. అవధూతలకే అవధూత, మహాయోగి, స్మర్తృగామి
ఐన దత్తుని పేరు వాడుకుని దత్తుడు చెప్పిందానికి వ్యతిరిక్తంగా ఎలా ప్రచారం కావిస్తున్నారు?
దత్తార్పణం..
No comments:
Post a Comment