శ్రీ గురుభ్యోనమః
శ్రీ గణేశాయ నమః
వందే స్మర్తృగామీ సనోవతు!
నాలుగు యుగాలలో కృత యుగంలోనే అవతరించారని కథనాలున్నా త్రేతాయుగ గురుమూర్తిగా కొలవబడ్డ శ్రీ దత్తాత్రేయులవారి గురించిన కొన్ని వివరాలు, శ్రీ దత్తాత్రేయులవారి అవతారముల గురించిన దత్త పురాణాంతర్గతమైన వివరాలు....
పూర్వం గోదావరీ తీరంలో ఉన్న అంగీరస మహర్షి ఆశ్రమంలో శ్రీ పైల మహర్షి కుమారుడైన వేదధర్ముడు ధర్మవేత్త సుప్రసిద్ధుడు. "వేద ధర్ముడు" సార్థక నామధేయుడు. ఆయన వద్ద ఎందరో శిష్యరికం చేసావారు. అందులో ఒకరు దీపకుడు. దాదాపు అన్ని పురాణాలూ సూత- శౌనకాదు మునుల సంభాషణలుగా ఉన్నట్లే దత్తపురాణం వేదధర్మునికి ఆయన శిష్యుడైన దీపకునికి మధ్యగురుశిష్య వాత్సల్యంతో జరిగిన సంభాషణలుగా లోకానికి వ్యక్తమయ్యాయి. ఇవి మాత్రమే "దత్తపురాణాంతర్గతం"గా చెప్పబడినదత్తాత్రేయుని అవతారాలు (అవతరించిన కాల నిర్ణయంతో పాటు). వేద ధర్మాన్ని పట్టుకున్న మహర్షి, దీపకుడనే శిష్యుని ద్వారా జ్ఞాన దీపాన్ని వెలిగించే దత్తాత్రేయులవారి విషయాలను మనకందించారు.
౦౧) యోగిరాజు - కార్తీక శుద్ధ పౌర్ణమి
౦౨)అత్రివరదుడు - కార్తీక బహుళపాడ్యమి
౦౩)దత్త ప్రభువు - కార్తీక బహుళ విదియ
౦౪)కాలాగి శమనుడు - మార్గశిరశుద్ధ చతుర్థశి, పౌర్ణమి
౦౫) యోగిజన వల్లభుడు - మార్గశిర పౌర్ణమి
౦౬) లీలా విశ్వంభరుడు - పౌష్య పౌర్ణమి
౦౭) సిద్ధరాజు - మాఘపౌర్ణమి
౦౮) జ్ఞాన సాగరుడు - ఫాల్గుణ శుద్ధపంచమి
౦౯) విశ్వంభరావధూత - చైత్ర పౌర్ణమి
౧౦) మాయా’ముక్తా’వధూత - వైశాఖ శుద్ధ చతుర్దశి
౧౧) మాయా’యుక్తా’వధూత - జ్యేష్ఠ శుద్ధత్రయోదశి
౧౨) ఆది గురు - ఆషాడ పౌర్ణమి
౧౩) శ్రీ శివరూపుడు - శ్రావణ పౌర్ణమి
౧౪) శ్రీ దేవదేవుడు - భాద్రపద శుద్ధ చతుర్దశి
౧౫) శ్రీ దిగంబరుడు - ఆశ్వయుజ పౌర్ణమి
౧౬) శ్రీ కృష్ణశ్యామ కమల నయనుడు - కార్తీక శుద్ధ ద్వాదశి.
ఇవి మాత్రమే "దత్తపురాణాంతర్గతం"గా చెప్పబడినదత్తాత్రేయుని అవతారాలు
ఈ అవతారాల గురించిన విశేషాలను కూడా రాబోవు రోజులలో…
…సశేషం
శ్రీ దత్తార్పణం
No comments:
Post a Comment