శ్రీ గురుభ్యోనమః
విజయ దశమి నే మనం దసరా అంటూ ఉంటాం నిజానికి దశపాపహర దశమి అని జ్యేష్ట మాసంలో వస్తుంది. శరన్నవరాత్ర్యుత్సవాలు చేసినా పది రకాల పాపాలను హరించేది అని దీన్ని కూడా దశ పాప హర దశమి అని పిలవడంలో రాను రాను అదికాస్తా దసరా అయ్యింది. ఐతే మనకి కలిగే ఈ పది పాపాలేమిటో చూద్దాం.....
అదత్తానాముపాదానమ్ హింసా చైవ విధానతః
పరదారోపసేవా చ కాయికం త్రివిధం స్మృతమ్!
౦౧)
తనది కాని దాన్ని
స్వంతం చేసుకోవడం
౦౨)
అకారణ హింస
౦౩)
పర స్త్రీ/పురుష
వ్యామోహం
ఈ
మూడు పాపాలు శరీరం
తో చేసేవి
పరుష్యమనృతమ్
చైవ పైశున్యమ్ చాపి సర్వశః
అసంబద్ధ
ప్రలాపం చ వాఙ్మయం చతుర్విధం!
౦౪) అకారణంగా ఇతరులతో పరుషమైన మాటలు మాట్లాడడం,
౦౫) అసత్యం మాట్లాడడం
౦౬) ఎదుటివారి గూర్చి తప్పుగా మాట్లాడడం,
చాడీలు చెప్పడం
౦౭) అసంబద్ధ ప్రలాపనలు (సంబంధం,
సందర్భం లేకుండా మాట్లాడాడం = వదరడం)
ఈ నాలుగు పాపాలు వాక్కు తో చేసేవి
పరద్రవ్యేష్వోభిధ్యానమ్
మనసానిష్టచిన్తనమ్
వితథాభినివేశమ్
చ మానసం త్రివిధమ్ స్మృతమ్!
౦౮) ఇతరుల ఐశ్వర్యాన్ని పొందాలనే ఆలోచన
౦౯) ఇతరులకు ఎలా హాని కలిగించాలా అనే ఆలోచన
౧౦) ఇతరులపై పుకార్లను ఇష్టపడడం
ఈ మూడూ పాపాలు మనసుతో చేసేవి
ఈ పాపాలకి నిష్కృతి ఉన్నా నిష్కృతిలేనివిగా చెప్పబడే పాపాలను
పాతకాలంటారు. అవి ఐదు రకాలు.
బ్రహ్మహా
హేమ హారీచ సురాపో గురుతల్పగః
మహాపాతకినోహ్యేతే
తత్సంసర్గీచ పంచమః!
పంచ మహాపాతకాలు
౧) బ్రహ్మ హత్య
౨) బంగారః దొంగతనం
౩) సురాపానం
౪) గురుద్రోహి
౫) పై నలుగురితో కానీ ఏఒక్కరితో కానీ సంగము.
ఈ అన్నిటికీ నిష్కృతి ఉందేమో కానీ "కృతఘ్నో నాస్తి
నిశ్చయ" కృతఘ్నునికి మాత్రం ఏ నిష్కృతిలేదు అని రామాయణం.
(ఇవి మాత్రమే పాపాలు అని కావు. ఇంకా బోలెడు చెప్పారు పురాణంలో ... గోఘ్నశ్చైవ
కృతఘ్నశ్చ సురాపోగురుతల్పగః బ్రహ్మహా
హేమహారీచ హ్యథవావృషలీపతిః స్త్రీ బీలఫూతకశ్చైవ పాపీచానృతభాషణః అనాచారీ తథాస్తేయీ పరదారాభిగస్తథా పరవవాదీ
ద్వేషీచ వృత్తిలోపకరస్తథా అకార్య కారీకృత్యఘ్నో... )
No comments:
Post a Comment