Pages

Tuesday, May 28, 2019

గొప్ప వ్యక్తి, గొప్పతనం

ఒక వ్యక్తి గొప్పవ్యక్తి అవడానికీ,
గొప్పవ్యక్తిగా అభివర్ణింపబడడానికీ హస్తిమశకాంతర బేధం ఉంది.

అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది. గొప్పతనం, ఆభిజాత్యం అనే బుడగ పగులుతుంది. నిజమైన గొప్పవ్యక్తులే గొప్పవారిగా కీర్తింపబడతారు.


(భుజాలు తడుముకోవద్దు... LoL)

ఉదాః- కాంగ్రెస్, సెక్యులర్ నేతలనే దశాబ్దాలుగా గొప్పవారుగా చిత్రీకరింపబడ్డారు, వాళ్ల వ్యక్తిత్వాలకతీతంగా, కాంగ్రెసేతర స్వాతంత్ర్య సమరయోధులు, ముఖ్యంగా మేరునగధీరులైన సనాతన ధర్మానుయాయులను అసలు లక్ష్యపెట్టలేదు.


-శంకరకింకర

Saturday, May 25, 2019

సర్వత్ర భయం! భయం! భయం!

సంపాదించిన ధనం ఎవరిపాలోనని భయం,

సాధించిన కీర్తి  పాడౌతుందేమోనని భయం,

సాంగత్యమున్న జనంలో ఎవడు దెబ్బేస్తాడోనన్నం భయం.

సర్వత్ర భయం! భయం! భయం!

అందుకే తేనెటీగ లాంటి బ్రతుకొద్దని తేనెటీగనిచూసి నేర్చుకున్నానని చెప్పాడు అజగరుడు ప్రహ్లాదుడితో...

ధనం, జనం, యశం తో మమేకమవకుండా *సత్యం* తో మాత్రమే మమేకమై బ్రతకమని బోధించాడు.

- శంకరకింకర

Wednesday, May 22, 2019

ప్రహ్లాదుని ధృతి

''ఎవని బలమున నీవు నేను చెప్పిన మాట వినక అతిక్రమించుచున్నావు?'' అని అడుగగా, 

''ఏ భగవంతుడు ఈ జగమును సృజించి పాలించుచున్నాడో, అతని బలముననే ఇట్లు ప్రవర్తించుచున్నాను. అంతః శత్రువులను గెలువలేక ప్రపంచమంతనూ గెలువ గల్గితినని తలంచుట భ్రాంతి. గనుక అంతఃశత్రువులను జయించుడు'' అని ప్రహ్లాదుడు తండ్రికి విన్నవించెను.


ఆహా ఏమి ధృతి అదికదా కావలసినది. ఎంతమంది బలగం ఉన్నా, అఖండైశ్వర్యం, త్రిలోకాధిపతిఅనే కీర్తి... ప్చ్ ఎన్ని ఉన్నా హిరణ్యకశిపుడు ఏమీలేనివాడే... అర్భకుడు, బాలకుడు అనుకున్న ప్రహ్లాదుడు అన్నీ ఉన్నవాడే!


-శంకరకింకర

Saturday, May 18, 2019

శ్రీ కూర్మనాథ జయంతి - తత్త్వం

సముద్రంలో ఇతర జలాలో ఉండే తాబేలు తను అటూ ఇటూ వెళ్లడానికి సంసార వ్యాపారానికి గానూ కాళ్లూ చేతులు బయటపెట్టి కదిలిస్తుంది. ఆ గమనం అవసరం లేనప్పుడు వాటిని తాబేటి డిప్పలోకి లాగేస్కుంటుంది.

ఇది ఆధ్యాత్మిక సాధనలో విషయ సుఖాలనుంచి ఇంద్రియాలను వెనక్కు మరల్చడమనే స్థితికి ప్రతీక. ఎంత గొప్ప స్థితికి చేరితే అంత లోపలికి లాక్కోవాలి. ఎంత పెరిగితే అంత ఒదగాలి, సముద్ర స్వరూపమైన ప్రపంచ సంసార వ్యాపారం నుండి తగ్గాలి ధన,జన,బల,కీర్తి మున్నగు లౌకిక విషయాలనుండి తగ్గి బహిర్ముఖ ప్రవృత్తిని అంచెలంచెలుగా ఆపి అంతర్ముఖ ప్రవృత్తిలోకి వెళ్లగలిగే చిత్తవృత్తి రూప ప్రజ్ఞకు శ్రీ కూర్మనాథ రూపం ప్రతీక.

-శంకరకింకర

Saturday, May 11, 2019

ధర్మం భూషణం కారాదు

ధర్మం భూషణం కారాదు, అది తీసి పక్కనపెట్టేసేది కాదు.

ధర్మం గుణం కావాలి. జీర్ణమైపోవాలి అప్పుడే జీవుడు ధర్మాత్ముడౌతాడు, తద్వారా ధర్మి ఔతాడు.

వాచావేదాంతం వలె వాచా ధర్మం కూడా అప్రయోజనకారి.

ధర్మ భాషణం కన్నా ధర్మాచరణం ప్రభావవంతం, ఉన్నతం.

-శంకరకింకర

Friday, May 10, 2019

ధర్మాచరణం

ధర్మాన్ని ఆచరించడం
ఆచరించినదానికి ధర్మాన్ని తోడు తెచ్చుకోవడం❌