శ్రీ గురుభ్యోనమః
నమస్తే
కుంఠీకరోతు విపద్మమ కుంచిత భ్రూ
చాపాంచితః శ్రితవిదేహ భవానురాగః!
రక్షోపకార మనిశం జనయన్ జగత్యామ్
కామాక్షి! రామ ఇవతే కరుణా కటాక్షః!! (మూక
మహాకవి)
అమ్మా! కామాక్షీ! నీ కరుణా కటాక్షము
రాముడే. రాముడు వంచిన ధనస్సు కలిగినవాడు. నీ కటాక్షము వంచిన కనుబొమలు కలది. కటాక్షము
సంసారులలో దేహ అనుభవ అనురాగ రాహిత్యాన్ని పొందింపచేస్తుంది. రాముడు ’విదేహ’ రాచకన్య
సీతమ్మను పొందినవాడు. కటాక్షము అనునది జగత్రక్షణమునకు ఉపకారము చేస్తుంది. రాముడు జగద్రక్షణోపకారమొనర్చినవాడు.
ఈ నీ కరుణా కటాక్షమే రాముడు రాముడే నీ కరుణా కటాక్షము.