శ్రీ గురుభ్యోనమః
పవిత్రయ జగత్రయీవిబుధబోధజీవాతుభిః
పురత్రయవిమర్దినః పులకకఞ్చులీదాయిభిః!
భవక్షయవిచక్షణైర్వ్యసనమోక్షణైర్ వీక్షణై-
ర్నిరక్షరశిరోమణిం కరుణయైవ కామాక్షి! మామ్!!
అమ్మా! మూడులోకాల్లోని పండితులు, విద్వాంసుల యొక్క జ్ఞానానికి జీవనానికి కారణమైనటువంటి, సదాశివునికి పులకాంకురాల కవచాన్ని తొడిగించునట్టి, సంసారాన్ని నశింపజేసే సామర్థ్యం కలిగినదైనటువంటి, అన్ని వ్యసనముల బారినుండి విడిపింపగల నీ చూపులతో... ఆమ్మా కామాక్షీ! దయతో నీ చూపులతో ఈ నిరక్షరకుక్షులలో గొప్పవాడినై, ఏమీ తెలియని వారిలో శిరోమణినైన నన్ను పవిత్రునిగా చేయమ్మా....!!!