Pages

Friday, April 26, 2019

గురుసూక్తము

( సేకరణ)

శ్రీ గురుసూక్తము..!!💐శ్రీ💐
ఓం నమః శివాయ..!🙏

శ్రీ గురు సూక్తము..!!💐
ఓం సచ్చిదానంద రూపాయ కృష్ణాయా క్లిష్టకారిణే||నమోవేదాంతవేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే||

ఓంనమోబ్రహ్మాదిభ్యో, బ్రహ్మవిద్యాసంప్రదాయకర్తృభ్యో||
వంశఋషిభ్యో మహాద్భ్యో నమో గురుభ్యః||

ఓం నమో ప్రణవార్ధాయ, శుద్ధజ్ఞానైకమూర్తయే||
నిర్మలాయ ప్రశాన్తాయ దక్షిణామూర్తయే నమః||

ఓం హయాస్యాద్య వతారైస్తు జ్ఞానసిద్ధా మునీశ్వరాః||
కృతార్ధతాంగతాస్తాంవై నారాయణ ముపాస్మహే||

ఓం వేదతత్త్వైర్మహావాక్యైర్వసిష్ఠాద్యామహార్షయః||
చతుర్భిశ్చతురాసన్ తంవై పద్మభువం భజే||

ఓం బ్రహ్మర్షిర్బ్రహ్మ విద్వర్యో బ్రహ్మణ్యో బ్రాహ్మణ ప్రియః||
తపస్వీ తత్త్వవిద్యస్తు తం వసిష్ఠం భజేన్వహం||

 ఓంయోగజ్ఞం యోగినావర్యం బ్రహ్మజ్ఞాన విభూషితం||
శ్రీమద్వశిష్ఠ తనయం శక్తిం వందే మహామునియే||

ఓం ధర్మజ్ఞంధార్మికం ధీరం ధర్మాత్మా నందయానిధిం||
ధర్మశాస్త్ర ప్రవక్తారం పరాశర మునింభజే||

ఓం కృష్ణ ద్వైపాయనం వ్యాసం సర్వలోకహితేరతం||
వేదాబ్జభాస్కరం వందేశమాదినిలయం మునిం||

ఓం పరాశరపౌత్రం శ్రీవ్యాసపుత్రమకల్మషం||
నిత్యవైరాగ్య సంపన్నం జీవన్ముక్తమ్ శుకంభజే||

ఓం మాండూక్య కారికాకర్తా యోభాతి బ్రహ్మవిద్వరః||
శ్రీగౌడపాదాచార్యం తం ప్రణమామి ముహుర్ముహుః||

ఓం యోగీశ్వరం వేదచూడం వేదాంతార్ధనిధిం||
మునిం గోవింద భగవత్పాదాచార్యవర్య ముపాస్మహే ||

ఓం హరలీలా వతారాయ శంకరాయపరౌజసే||
కైవల్యకలనా కల్పతరవే గురవేనమః||

ఓం బ్రాహ్మణే మూర్తిమతే శృతానాం శుద్ధిహేతవే||నారాయణయతీన్ద్రాయ తస్మై గురవేనమః||   

ఓం సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమాం||
అస్మదాచార్య పర్యంతం వందేగురు పరంపరాం||

ఓం సచ్చిదానంద రూపాయ శివాయపరమాత్మనే||
నమో వేదాంత వేద్యాయ గురవేబుద్ధిసాక్షిణే||

ఓం నిత్యానందైక కందాయ నిర్మలాయచిదాత్మనే||
జ్ఞానోత్తమాయ గురవే సాక్షిణే బ్రాహ్మణేనమః|| 

గూఢావిద్యా జగన్మాయా దేహశ్చాజ్ఞాన సంభవః||
విజ్ఞానం యత్ప్రసాదేన గురుశబ్దేనకథ్యతే||

స్వదేశికస్వైవచ నామకీర్తనమ్ భవేదంతస్య శివస్యకీర్తనమ్||
స్వదేశికస్వైవచ నామచింతనం భవేదంతస్య శివస్యచింతనం||

కాశిక్షేత్రం నివాసశ్చ జాహ్నవీ చరణోదకం||
గురుర్విశ్వేశ్వరః సాక్షాత్ తారకం బ్రహ్మనిశ్చయః||

గురుసేవా గయాప్రోక్తా దేహసాక్షా దక్షయోవటః||
తత్పాదం విష్ణుపాదంస్యాత్ తత్ర దత్తమచస్తతం||

స్వాశ్రమంచ స్వజాతించ స్వకీర్తిమ్ పుష్ఠివర్ధనం||
ఏతత్సర్వం పరిత్యజ్య గురురేవ సమాశ్రయేత్||

గురువక్త్రే  స్థితావిద్యా గురుభక్త్యాచ లభ్యతే||
త్రైలోక్యేస్ఫుటవక్తారో దేవర్షిపితృమానవాః||

గుకారశ్చగుణాతీతో రూపాతీతోరుకారకః||
గుణరూప విహీనత్వాత్ గురురిత్యభిధేయతే||

గుకారః ప్రధమవర్ణో మాయాదిగుణ భాసకః||
రుకార్యోస్తి పరంబ్రహ్మ మాయాభ్రాంతి విమోచకం||

సర్వశృతి శిరోరత్న విరాజిత పదాంబుజం||
వేదానార్ధ ప్రవక్తారం తస్మాత్ సంపూజయేత్ గురుమ్||

యస్య స్మరణమాత్రేణ జ్ఞానముత్పద్యతేస్వయం||
సః ఏవ సర్వ సమ్పత్తిః తస్మాత్ సంపూజయేత్ గురుమ్||

సంసారవృక్షమారూఢాః పతన్తినరకార్ణవే||
యస్తానుద్ధరతే సర్వాన్ తస్మై శ్రీగురవేనమః||

ఏకఏవ పరోబంధుర్విషయే సముపస్థితే||
గురుః సకలధర్మాత్మా తస్మై శ్రీగురవేనమః||

భవారణ్య ప్రవిష్టస్య దిఙ్మోహభ్రాంత
చేతసః||
యేన సందర్శిత పంథాః తస్మై శ్రీగురవేనమః||

తాపత్రయాగ్ని తప్తానాం అశాంత ప్రాణినాం భువి||
గురురేవ పరాగంగా తస్మై శ్రీగురవేనమః||

శివేరుష్టే గురుత్రాతా గురౌరుష్టే నకశ్చినః||
లబ్ద్వాకులగురుం సమ్యక్ గురుమేవ సమాశ్రయేత్||

అత్రినేత్రశివః సాక్షాత్ ద్విబాహుశ్చహరిః||
స్మ్రుతః యో-చతుర్వదనో బ్రహ్మ శ్రీగురుః కధితప్రియే||

నిత్యంబ్రహ్మ నిరాకారం నిర్గుణం బోధయేత్ పరమ్||
భాసయన్ బ్రహ్మభావంచ దీపోదీపాన్తరం యథా||

గురోర్ ధ్యానే నైవనిత్యం దేహీబ్రహ్మమయో భవేత్||
స్థితశ్చ యత్రకుత్రాపి ముక్తాసౌనాత్రిసంశయః||

జ్ఞానంవైరాగ్యమైశ్వర్యం యశఃశ్రీః సముదాహృతం||
షడ్గుణైశ్వర్య యుక్తోహి భగవాన్ శ్రీగురుః ప్రియే||

గురుః శివో గురుః దేవో గురుర్బన్ధుః శరీరిణామ్||
గురురాత్మా గురుర్జీవో గురోరన్యన్నవిద్యతే||

యతః పరమకైవల్యం గురుమార్గేణ వైభవేత్||
గురుభక్తి రతిః కార్యాః సర్వదా మోక్షకాంక్షిభిః||

గురుర్దేవో గురుర్ధర్మో గురౌనిష్టా పరంతపః||
గురోః పరతరం నాస్తి త్రివారం కధయామితే||

నమో నమస్తే గురవే మహాత్మనే విముక్తసఙ్గాయ సదుత్తమాయ||
నిత్యాద్వయానంద రసస్వరూపిణే భూమ్నే సదా--పార దయామ్బుదామ్నే||

శిష్యాణామ్ జ్ఞానదానాయ లీలయాదేహధారిణే||
సదేహోసి విదేహాయ తస్మై శ్రీగురవేనమః||

రాగద్వేషవినుర్ముక్తః కృపయాచ  సమన్విత||
సమయానాంచ సర్వేషాం జ్ఞానసార పరిగ్రహీ||

గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవ సదాచ్యుతః||
న గురోరధికం కశ్చిత్రిషులోకేషు విద్యతే||

దివ్యజ్ఞానోపదేష్టారం దేశికం పరమేశ్వరం||
పూజయాత్పరయా భక్త్యా తస్యజ్ఞాన ఫలంభవేత్||

గురురేవపరబ్రహ్మ గురురేవపరాగతిః||
గురురేవ పరావిద్యా గురురేవ పరాయణం||

గురురేవ పరాకాష్ఠా గురురేవ పరంధనం||
యస్మాత్తదుపదేష్టా సౌ తస్మాత్గురు తరోగురుః||

గురుభావపరంతీర్థం మన్యతీర్థం నిరర్థకం||
సర్వతీర్థమయందేవి శ్రీగురోశ్చరణామ్బుజం||

సప్తసాగరపర్యంతం తీర్థస్నానఫలంతుయాత్||
గురుపాద పయోబంధోః సహస్రాంశేన తత్ఫలం||

శోషణం పాపపంకస్య దీపనమ్ జ్ఞాన తేజసః||గురోఃపాదోదకం సమ్యక్ సంసారార్ణవ తారకం||

అజ్ఞానమూలహరణం జన్మకర్మ నివారకం||
జ్ఞానవైరాగ్యసిద్ధ్యర్థం గురు పాదోదకం పిబేత్"
 
ఇతి సంకలిత 'శ్రీ గురుసూక్తం' సమాప్తం.                                                       
ఓం శాంతిః శాంతిః శాంతిః"

శ్రీ గురుసూక్తం -- తాత్పర్యం.💐
ఓం సచ్చిదానందరూపుడు, అక్లిష్టకారి, వేదాంతవేద్యుడు, బుద్ధిసాక్షి, జగద్గురువగు శ్రీకృష్ణునకు నమస్కారము.

ప్రణవార్థ స్వరూపుడును, శుద్ధజ్ఞానైకమూర్తియు, నిర్మలుడును, ప్రశాన్తుడును నగు దక్షిణామూర్తికి నమస్కారము.
ఎవని హయగీతాద్యవతారములచే మునీశ్వరులు జ్ఞానసిద్ధిని బడసి కృతార్థులైనారో అట్టి శ్రీమన్నారాయణుని మేముపాసించెదము.

చతుర్వేదతత్త్వముల చేతను, మహా వాక్యముల చేతను వసిష్ఠాదిమహర్షులు ఎవనివలన విజ్ఞానచాతుర్యము బడసిరో అట్టి పద్మజుడగు బ్రహ్మదేవుని నేను భజించెదను.
బ్రహ్మర్షియు, బ్రహ్మ విద్వరుడును, బ్రహ్మణ్యుడును, బ్రహ్మజ్ఞ ప్రియుడును నగు వసిష్ఠమహర్షిని నిరంతరమూ నేను ధ్యానించెదను.

యోగజ్ఞుడును, యోగులలో నుత్తముడును బ్రహ్మజ్ఞానవిభూషితుడును, శ్రీవశిష్ఠమునీన్ద్రుని కొమరుడునగు శ్రీశక్తి మహామునికి నమస్కారము.  ధర్మజ్ఞుడును, ధార్మికబుద్ధి కలవాడును, ధీరుడును, ధర్మాత్ముడును, దయానిధియు, ధర్మశాస్త్రముల లెస్సగా వచించు వాడునునగు పరాశరుని గొల్చెదను.

శ్రీకృష్ణద్వైపాయనుడును, సర్వలోకహితమునుకూర్చి ఆనందించువాడును, వేదపద్మములకు సూర్యునివంటివాడు, శమాదులకు నిలయమైనవాడును, మునియునగు శ్రీవ్యాసమహర్షులకు
నమస్కరించుచున్నాను.
శ్రీపరాశరుని పౌత్రుడును, శ్రీవ్యాసమహర్షిపుత్రుడును, అకలుషుడును, నిత్యవైరాగ్యసంపన్నుడును, జీవన్ముక్తుడును నగు శ్రీశుకమహర్షిని భజించెదను.

మాండూక్యకారికల రచించినవాడును, బ్రహ్మవిద్వరుడై భాసిల్లు వాడునునగు శ్రీగౌడపాదాచార్యుని మాటిమాటికిని మ్రొక్కెదను.
యోగీశ్వరుడును, వేదవిభూషణుడును, వేదాంతార్థ నిలయుడును, మునీన్ద్రుడును, ఉత్తముడునగు
శ్రీ గోవిందభగవత్పాదాచార్యుని ధ్యానించుచున్నాము. పరమేశ్వరుని లీలావతారుడును, మహాశక్తియుతుడును, మోక్షమొసంగుట యందు కల్పవృక్షము వంటివాడునునగు శ్రీ శంకర భగవత్పాదాచార్య గురువులకు నమస్కారము.

మూర్తీ భవించిన బ్రహ్మస్వరూపుడును, శాస్త్రములశుద్ధికి కారణ భూతుడును, యతీన్ద్రుడునునగు శ్రీనారాయణ గురువునకు నమస్కారము.
శ్రీదక్షిణామూర్తులైన సదాశివునితో ప్రారంభమై, మధ్యమమున  శ్రీశంకరాచార్య  భగవత్పాదులతో కూడియుండి, మా సద్గురువులవరకు విస్తరించియున్న శ్రీగురుపరంపరకు నమస్కరించుచున్నాము.

సచ్చిదానందస్వరూపుడును, శివుడును, పరమాత్మ రూపుడును, వేదాంత వేద్యుడును, బుద్ధిసాక్షియునగు గురుదేవునకు వందనము.
నిత్యానందైక స్వరూపుడును, నిర్మలుడును, చిదాత్మ స్వరూపుడును, ఉత్తమజ్ఞానమూర్తియు సాక్షియు,
బ్రహ్మ స్వరూపుడునునగు గురువునకు నమస్కారము. 

జగత్తు గూఢమైన, అవిద్యాత్మకమైన మాయారూపము మరియు శరీరము అజ్ఞానము నుండి ఉత్పన్నమైనది. దీనికి సంబంధించిన జ్ఞానము ఎవరివలన కలుగునో వారిని 'గురు' అను శబ్దముతో వ్యవహరిస్తారు. గురుదేవుని నామకీర్తనమే అనంతస్వరూపుడైన శివభగవానుని కీర్తనము.
గురుదేవుని యొక్క నామచిన్తనమే అనంతస్వరూపుడైన శివభగవానుని యొక్క చింతనము.
గురుదేవుని నివాస స్థలమే కాశిక్షేత్రము.
గురుదేవుని పాదోదకమే పవిత్రగంగానది.
శ్రీగురుదేవుడే విశ్వేశ్వరుడు.
మనియు నిశ్చయముగా సాక్షాత్తు తారకబ్రహ్మ గురువే. గురుసేవయే పుణ్యక్షేత్రమైన గయ.
గురుదేవుని శరీరమే కోరిన కోరికల నిచ్చే అక్షయవటవృక్షము.
గురుపాదము విష్ణుభగవానుని శ్రీచరణము.
అందు నిమగ్నమైన మనస్సుకూడా అదేస్థితిని పొందును. బ్రహ్మచర్యగృహస్థాది ఆశ్రమములు, జాతిని, కీర్తిని, పాలన, పోషణ, మొదలగువన్నియు విడచిపెట్టి శ్రీగురుదేవునే ఆశ్రయించవలయును.

శ్రీగురుదేవుని యందున్న విద్య గురుభక్తి వలననే లభించును.
ఈమాట ముల్లోకములయందును దేవతలచే, ఋషులచే, మానవులచే స్పష్టముగా చెప్పబడుచున్నది. 'గు' కారమునకు గుణముల కతీతుడనియు, 'రు' కారమునకు రూపమున కతీతుడనియు,
గుణ రూపములు రెండునూ లేనందున 'గురు' వనియు చెప్పబడుచున్నది.
గురుశబ్దములో మొదటిదగు 'గు'కారమునకు
మాయాది గుణములతో కూడియున్నదనియు, 'రు'కారమునకు మయాభ్రాంతిని తొలగించే పరబ్రహ్మమనియు భావము.

సర్వశృతిరూపములైన శ్రేష్ఠరత్నములచే విలసిల్లు చరణకమలములు కలవాడును, వేదాంతముల యొక్క అర్థమును చెప్పేవాడు కనుక గురువును పూజింపవలయును.
ఎవరిని స్మరించినంత మాత్రముననే తనంతతానుగా జ్ఞానము కలుగుతుందో అతడే సర్వసంపదల స్వరూపము.
అందువలన గురుదేవుని బాగుగా పూజింపవలయును. సంసారమనే చెట్టునెక్కి, నరకమనే సముద్రములో పడుచున్నవారినందరినీ ఉద్ధరించునట్టి గురుదేవునకు నమస్కారము. 

ఏదైనా విషమపరిస్థితి ఎదురైనప్పుడు గురువు ఒక్కరే పరమబంధువై మనలను కాపాడును.
సర్వధర్మముల ఆత్మస్వరూపము గురుదేవుడే.
అట్టి గురుదేవునికి నమస్కారము.
ఇహలోకమనెడి అరణ్యములో ప్రవేశించి దిక్కు తెలియని చిత్తభ్రమ కలిగినస్థితిలో మనకు దారిచూపించునట్టి గురుదేవునకు నమస్కారము. 

ఈభూమి పై తాపత్రయము అను మూడువిధములైన అగ్నులలో కాలుచూ, శాంతి లేని ప్రాణులకు ఉత్తమగంగ వంటి గురుదేవునకు నమస్కారము.
ఒకవేళ శివుడు కోపించినచో గురువు రక్షిస్తాడు.
గురువే కోపించిన ఇక ఎవ్వరూ రక్షింపలేరు.
కావున మంచి గురువును పొంది చక్కగా ఆగురువునే ఆశ్రయింపుము.
మూడుకన్నులు లేని సాక్షాత్తు శివుడు,
రెండుచేతులు గల విష్ణువు,
నాలుగుముఖములు లేని బ్రహ్మ దేవుడు
శ్రీగురుదేవుడే అని తెలియవలెను.

గురువు అనబడు వారు సదాబ్రహ్మలు, నిరాకారులు, నిర్గుణులు. వారు పరమును బోధించుదురు. బ్రహ్మభావముతో, ఒకదీపముతో వేరొకదీపము
వెలిగించు నట్లుగా శిష్యులలో బ్రహ్మభావమును ప్రకటించుచుందురు.

సదా గురుదేవుని ధ్యానించు జీవుడు బ్రహ్మమయుడు అగుచున్నాడు.
అట్టివాడు ఎక్కడ ఉన్ననూ ముక్తుడే అనుటలో సందేహము లేదు.
భగవత్స్వరూపుడగు గురుదేవుడు జ్ఞానము, వైరాగ్యము, ఐశ్వర్యము, యశము, సంపద, మధురవాణి అను ఆరుగుణములచే కూడి యుండును.
శరీరధారులకు గురువే శివుడు.
గురువే దేవుడు. గురువే బంధువు.
గురువుయందు నిష్ఠతో నుండుటయే పరమ తపస్సు. గురువును మించినదేదియూ లేదు.
దీనిని ముమ్మారు చెప్పుచున్నాను.
సత్పురుషులలో నుత్తముడును,
సర్వదా అంతములేని దయకు సముద్రుడును,
సకల బంధములు త్రెంపి అసంగుడు,
నిర్లిప్తుడు నైన వాడును, నిత్యుడును, అద్వయుడును, ఆనందరసస్వరూపియునైన వాడును,
భూమి పైన పరబ్రహ్మస్వరూపుడైన వాడునునైన మీకు(గురువునకు) నమస్కారము.
శిష్యులకు జ్ఞానమొసంగుటకు లీలగా దేహము ధరించిన వాడును, దేహముతో నున్ననూ,
విదేహమగు పర బ్రహ్మములో నుండునట్టి గురుదేవునకు నమస్కారము.
రాగద్వేషములు లేనివాడుగను, కారణము నుద్దేశించకనే దయాసాగరుండును, సమస్త శాస్త్రములలోని జ్ఞానసారమెరింగిన వాడునునై  శ్రీ గురు దేవుడుండును.
 
గురువే పరబ్రహ్మ.ఆ పరబ్రహ్మమును చేరుత్రోవ గురువే. ఆ చేరుటకు కావలిసిన జ్ఞానము గురువే. 
ఆ చేరుట అనే ప్రక్రియ కూడా గురువే. 
దానికి కావలసిన సాధనసంపత్తి కూడా గురువే. 
చిట్టచివరికి ఏదైనా మిగిలియుంటుందంటే అది గురువే.  ఈ విధముగా ఉపదేశికులైన మీరు గురువులలో కెల్ల సద్గురువులు. 
గురుభావమే శ్రేష్టమైన పుణ్యక్షేత్రము.
ఇతర క్షేత్రములు నిరర్థకములు.
శ్రీగురుదేవుని చరణామ్బుజములు సర్వతీర్థమయము. ఏడు సముద్రముల వరకూగల అన్ని పుణ్యతీర్థములందునూ స్నానము చేయుటవలన ఎట్టిఫలము కలుగుచున్నదో,
అది గురుపాద జలము లోని ఒక్క బిందువులో
వెయ్యవ భాగమునకుసమానము.
శ్రీ గురుదేవుల యొక్క పదామృతము పాప పంకిలము తొలగించునది.
జ్ఞానతేజమును పెంపొందింపజేయునది మరియు
సంసార సాగరమును దాటించునట్టిది.

అజ్ఞానమును పెకలించివేయునదియును,
అనేక జన్మల కర్మను నివారించునదియు అగు గురుపాదోదకమును జ్ఞానవైరాగ్యములు సిద్ధించుట కొరకు పానము చేయవలెను.
శ్రీ గురుసూక్తము" అను సంకలనము సమాప్తము.
స్వస్తి..!!💐
ఓం నమః శివాయ..!!🙏
సర్వే జనా సుఖినోభవంతు..!!🙏

                        💐శ్రీ మాత్రే నమః💐

గురు తత్త్వమునెరుగక


గురు తత్త్వమునెరుగక
గురువు జేర కుజన మానసముల్ శుద్ధి పొందునె? తామరల జేరెడి మండూకముల భంగి!

----


గురువన్న నొకయుపాధి గాదది నిత్య సత్య స్వరూపమౌ చైతన్య దీప్తి. ఉపాధి బేధముల గొని గురువొకరూపి యని యేమరబోకు. గురువేకరూపి బలు యుపాధులందేక కాలమున ప్రకటింపబడు శుద్ధ చైతన్యరూపి. అల రామునకు వశిష్ఠ, విశ్వామిత్ర, అత్రి, సుతీక్ష్ణ, శరభంగ, అగస్త్యభ్రాత, అగస్త్యాదుల యుపాధులందు ప్రకటితమైన ఏక తత్త్వము గురుతత్త్వము. 

- శంకరకింకర

Wednesday, April 24, 2019

ఆధ్యాత్మ రాజకీయం

చదువులో రాజకీయం
ఉద్యోగంలో రాజకీయం
సమాజంలో రాజకీయం
ఇళ్లలో రాజకీయం,
కళల్లో రాజకీయం .. ఇగ్నోర్డ్!

ఆధ్యాత్మ మార్గంలో రాజకీయం?
ఆ మార్గం ఆధ్యాత్మ  మార్గం కానే కాదు.
తస్మాత్ జాగ్రత జాగ్రత

- శంకరకింకర

Tuesday, April 23, 2019

నయితి

నయితి
నయితి
నయితి

ఏది అది కాదో, దాన్ని అందుకునే మార్గంలో ఏది అడ్డొచ్చినా, పక్కకు జరిపి ముందుకు సాగిపోవాలి. మల్లెపువ్వే కావచ్చు అభిషేకధారకి అడ్డొస్తే సుకుమారంగా పక్కకి తప్పిస్తాం, అప్పుడు అయ్యో మల్లెపువ్వా, బిల్వపత్రమా అని అభిషేకాన్ని ఆపముకదా అలా.. నిరంతరం ఆధ్యాత్మ లక్ష్యాలకు చేరడానికి అడ్డుపడే ఆటంకం ఏదైనా, ఎవరైనా పక్కకు తప్పించాల్సిందే. " మానవ జీవిత గమ్యమైన పునరావృత్తిరహిత స్థితి నీ లక్ష్యమైతే"

- శంకరకింకర:

Sunday, April 14, 2019

నా గమ్యం నిశ్చలానందం!

నా గమ్యం నిశ్చలానందం,

నడత మొదలైన నాటినుండి నడుస్తూనే ఉన్నా..
కందపడీ, పైకి లేచి, పక్కన కూర్చుని చేరగిలపడి, గమ్యం అదికాదని యెరిగి.. రివ్వున మొదలై..

చలివేంద్రాలు, పూటకూళ్ల ఇళ్ళు, దారితప్పించే కూడళ్లు, మజిలీలు ఎన్నో ఎన్నెన్నో..

నడత మొదలైన నాటినుండి నడుస్తూనే ఉన్నా..

మొదట నిల్చిన తోడు ఇప్పుడు లేదు, ఇప్పటితోడు ఏనాటివరకో, కొత్త స్నేహాలెంతవరకో..

బాటలో భవనాలు కట్టినా, వనాల కూర్చినా, బస్తాలు మోసినా.. గమ్యం అదికాదని యెరిగి.. రివ్వున మొదలై..

నడత మొదలైన నాటినుండి నడుస్తూనే ఉన్నా..

సాయమొంది సాచి కొట్టినవారెందరో.. నడిచే కాళ్లలో కఱ్ఱ దూర్చినవారెందరో... నేడెందరో..  రేపటికింకెందరో..

కూటి కోసం, కూలి కోసం, కీర్తి కోసం, మందకోసం, స్వార్థ చింతనలో వ్యక్తిత్వం వీపున తన్నిన వారెందరో...

ఐనా..  నడత మొదలైన నాటినుండి నడుస్తూనే ఉన్నా..

ప్రభూ! నువ్వున్నావనే నమ్మికతో, గమ్యం చేరుస్తావనే పూనికతో,

అనితర సాధ్యమైన నువ్వే.. నా గమ్యం.

నా గమ్యం నిశ్చలానందం,

-శంకరకింకర:

Thursday, March 21, 2019

అంబా వజ్ర కవచం


 (సేకరణ)

ఇది కవచస్తోత్రం. మన శరీరాన్ని, మన యొక్క అవస్థలనీ, అదేవిధంగా పంచ భూతాలలోను, దశదిశలలోనూ అమ్మవారి రక్ష కావాలి అనే భావంతో చేయబడిన అద్భుతమైన స్తోత్రం.

౧. నమోదేవి జగద్ధాత్రి జగత్త్రయ మహారణే!
మహేశ్వర మహాశక్తే దైత్యద్రుమ కుఠారికే!!
౨. త్రైలోక్య వ్యాపిని శివే శంఖ చక్ర గదాధరి!
స్వశార్జ్ఞ వ్యగ్రహస్తాగ్రే నమోవిష్ణు స్వరూపిణి!!
౩. హంసయానే నమస్తుభ్యం సర్వ సృష్టివిధాయిని!
ప్రాచాంవాచాం జన్మభూమే చతురానన రూపిణి!!
౪. త్వమైంద్రీ త్వంచ కౌబేరీ వాయవీ త్వం త్వమంబుపా!
త్వం యామీ నైరుతీ త్వంచ త్వమైశీ త్వంచ పావకీ!!
౫. శశాంక కౌముదీ త్వంచ సౌరీశక్తి స్త్వమేవచ!
సర్వదేవమయీ శక్తిః త్వమేవ పరమేశ్వరీ!!
౬. త్వం గౌరీ త్వం చ సావిత్రీ త్వంగాయత్రీ సరస్వతీ!
ప్రకృతి స్త్వం మతిస్త్వం చ త్వమహంకృతి రూపిణీ!!
౭. చేతః స్వరూపిణీ త్వం సర్వేంద్రియ రూపిణీ!
పంచతన్మాత్ర రూపా త్వం మహాభూతాత్మికేంబికే!!
౮. శబ్దాది రూపిణీ త్వం వై కరణానుగ్రహా త్వము!
బ్రహ్మాండ కర్త్రీ త్వం దేవి బ్రహ్మాండాంతస్త్వమేవ హి!!
౯. త్వం పరాసి మహాదేవి త్వంచ దేవి పరాపరా!
పరాపరాణాంపరమా పరమాత్మ స్వరూపిణీ!!
౧౦. సర్వరూపా త్వమీశాని త్వమరూపాసి సర్వాగే!
త్వంచిచ్ఛక్తి ర్మహామాయే త్వంస్వాహా త్వంస్వధామృతే!!
౧౧. వషడ్ వౌషట్ స్వరూపాసి త్వమేవ ప్రణవాత్మికా!
సర్వ మంత్రమయీ త్వం వై బ్రహ్మాద్యాః త్వత్సముద్భవాః!!
౧౨. చతుర్వర్గాత్మికా త్వంవై చతుర్వర్గ ఫలోదయే!
త్వత్తః సర్వమిదం విశ్వం త్వయి సర్వం జగన్నిధే!!
౧౩. యద్దృశ్యం యదదృశ్యం స్థూలసూక్ష్మ స్వరూపతః!
తత్ర త్వం శక్తిరూపేణ కించిన్న త్వదృతే క్వచిత్!!
౧౪. మాత స్త్వయాద్య వినిహత్య మహాసురెంద్రం!
దుర్గం నిసర్గ విబుధార్పిత దైత్య సైన్యమ్!
త్రాతాఃస్మ దేవి సతతం నమతాం శరణ్యే
త్వత్తోపరః క ఇహ యం శరణం వ్రజామః!!
౧౫. లోకే త ఏవ ధనధాన్య సమృద్ధి భాజః!
తే పుత్ర పౌత్ర సుకళత్ర సుమిత్రవంతః!
తేషాంయశః ప్రసర చంద్ర కరావదాతం!
విశ్వం భవేద్భవసి యేషు సుదృక్ త్వమీశే!!
౧౬. త్వద్భక్త చేతసి జనే న విపత్తి లేశః
క్లేశః క్వ వాను భవతీ నతికృత్సుపుంసు!
త్వన్నామ సంసృతి జుషాం సకలాయుషాం క్వ
భూయః పునర్జనిరిహ త్రిపురారిపత్ని!!
చిత్రం యదత్ర సమరే సహి దుర్గదైత్యః
త్వద్దృష్టి పాతమధిగమ్య సుధానిధానం
మృత్యోర్వశత్వ మగమ ద్విదితం భవాని
దుష్టోపి తే దృశిగతః కుగతిం న యాతి!!
౧౮. త్వచ్ఛస్త్రవహ్ని శలభత్వమితా అపీహ
దైత్యాః పతంగరుచిమాప్య దివం వ్రజంతి!
సంతః ఖలేష్వపి న దుష్టధియో యతః స్యుః
సాధుష్వివ ప్రణయినః స్వపథం దిశంతి!!
౧౯. ప్రాచ్యాం మృడాని పరిపాహి సదా నతాన్నో
యామ్యామవ ప్రతిపదం విపదో భవాని!
ప్రత్యగ్దిశి త్రిపురతాపన పత్ని రక్ష
త్వం పాహ్యుదీచి నిజభక్తజనాన్ మహేశి!!
౨౦. బ్రహ్మాణి రక్ష సతతం నతమౌళి దేశం
త్వం వైష్ణవి ప్రతికులం పరిపాలయాధః!!
రుద్రాగ్ని నైర్రుతి సదాగతి దిక్షు పాంతు
మృత్యుంజయ త్రినయనా త్రిపురారి శక్త్యః!!
౨౧. పాతు త్రిశూలమమలే తవ మౌళిజాన్నో
ఫాల స్థలం శశికళా భ్రుదుమా భ్రువౌ చ!
నేత్రే త్రిలోచన వధూర్గిరిజాచ నాసా
మోష్ఠం జయాచ విజయా త్వధర ప్రదేశం!!
౨౨. శ్రోత్రద్వయం శ్రుతిరావా దశనావళిం  శ్రీః
చండీ కపోలయుగళం రసనాంచ వాణీ!
పాయాత్ సదైవ చిబుకం జయమంగళా నః
కాత్యాయనీ వదన మండలమేవ సర్వమ్!!
౨౩. కంఠ ప్రదేశ మనతాదిహ నీలకంఠీ
భూదారశక్తి రనిశం చ కృకాటికాయామ్!
కౌర్మ్యం సదేశ మైశం భుజదండమైన్ద్రీ
పద్మాచ ఫాణిఫలకం నతికారిణాం నః!!
౨౪. హస్తాంగుళీః కమలజా విరజా నఖాంశ్చ
కక్షాంతరం తరణి మండలగా తమోఘ్నీ!
వక్షః స్థలం స్థలచరీ హృదయం ధరిత్రీ
కుక్షి ద్వయం త్వవతు నః క్షణదా చరఘ్నీ!!
౨౫. అవ్యాత్ సదోదరదరీం జగదీశ్వరీ నో
నాభిం నభోగతి రజా త్వథ పృష్ఠదేశం!
పాయాత్ కటించ వికటా పరమా స్పిచౌనో
గుహ్యం గుహారణి రాపానమపాయ హంత్రీ!!
౨౬. ఊరుద్వయం చ విపులా లలితా చ జానూ
జంఘే జవావతు కఠోరతరాత్ర గుల్ఫౌ!
పాదౌ రసాతల చరాంగుళి దేశముగ్రా
చాంద్రీ నఖాన్ పదతలం తలవాసినీ చ!!
౨౭. గృహం రక్షతు నోలక్ష్మీః క్షేత్రం క్షేమకరీ సదా
పాతు పుత్రాన్ ప్రియకరీ పాయాదాయుః సనాతనీ
యశఃపాతు మహాదేవీ ధర్మం పాతు ధనుర్ధరీ
కులదేవీ కులం పాతు సద్గతిం సద్గతింప్రదా !!
౨౮. రణే రాజకులే ద్యూతే సంగ్రామే శత్రుసంకటే!
గృహేవనే జలాదౌచ శర్వాణీ సర్వతోవతు!!
ఫలశ్రుతి: మనుష్యుడు పవిత్రుడై భక్తి పూర్వకముగా ఈ స్తోత్రమును పఠించిన యెడల వారి ఆపదలను దుర్గాదేవి నశింపజేయును. ఈ స్తోత్రమందలి కవచమును ధరించిన వారికి ఏవిధములగు భయములుండవు. ఈ స్తోత్ర పాఠకులకు యముని వలన గాని, భూతప్రేతాదుల వలన గాని, విష సర్పాగ్ని విషమజ్వరాదుల వలన గాని ఏ విధమగు భయముండదు. ఈ స్తోత్రముతో జలమును ఎనిమిదిసార్లు అభిమంత్రించి త్రాగిన యెడల ఉదరపీడలు, గర్భపీడలు, తొలగును. బాలురకు పరమ శాంతి నొసంగును. ఈ స్తోత్రమున్న చోట దేవి తన సర్వశక్తులతో కూడి రక్షించును.

Tuesday, March 19, 2019

వాసనాక్షయం చేసుకోవడం అంత తేలిక్కాదు


గొప్ప గొప్ప సువాసననిచ్చే చందనపు చెట్లు, సంపెంగచెట్లలాంటి వాటి మొదళ్ళలోనే బ్రహ్మాండమైన జాతి సర్పాలుంటాయి. అంత మంచి సువాసననిచ్చే చెట్ల మొదట్లో ఉన్నాయని, విషం కక్కడం మానేసి మంచి సువాసనని అమృతాన్ని వెదజల్లుతాయనుకుంటున్నారా! ఒక్కనాటికి అలా వదలవవి. వాసనాక్షయం చేసుకోవడం అంత తేలిక్కాదు. అందుకోసం సత్సంగం వచ్చింది. సత్పురుష సహవాసం చేయగా చేయగా ఎప్పటికైనా మారతాడు. మారి ఊర్ధ్వముఖపయనం ఆరంభిస్తాడు జీవుడు.

 -శంకరకింకర

Friday, March 8, 2019

నవగ్రహ స్తోత్రం - శ్రీ వేద వ్యాస విరచితమ్


ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ !
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః !!

జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహదద్యుతిమ్ !
తమోరింసర్వపాపఘ్నం ప్రణతోSస్మి దివాకరమ్ !! !!

దధిశంఖతుషారాభం క్షీరోదార్ణవ సంభవమ్ !
నమామి శశినం సోమం శంభోర్ముకుట భూషణమ్ !! !!

ధరణీగర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభమ్ !
కుమారం శక్తిహస్తం తం మంగలం ప్రణామ్యహమ్ !! !!

ప్రియంగుకలికాశ్యామం రుపేణాప్రతిమం బుధమ్ !
సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ !! !!

దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభమ్ !
బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్ !! !!

హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమం గురుమ్ !
సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ !! !!

నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ !
ఛాయామార్తండ సంభూతం తం నమామి శనైశ్చరమ్ !! !!

అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనమ్ !
సింహికాగర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ !! !!

పలాశపుష్పసంకాశం తారకాగ్రహ మస్తకమ్ !
రౌద్రంరౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ !! !!

ఇతి శ్రీవ్యాసముఖోగ్దీతమ్ యః పఠేత్ సుసమాహితః !
దివా వా యది వా రాత్రౌ విఘ్న శాంతిర్భవిష్యతి !! ౧౦ !!

నరనారీ నృపాణాంచ భవేత్ దుఃస్వప్ననాశనమ్ !
ఐశ్వర్యమతులం తేషాం ఆరోగ్యం పుష్టివర్ధనమ్ !! ౧౧ !!

గ్రహనక్షత్రజాః పీడాస్తస్కరాగ్నిసముభ్దవాః !
తా సర్వాఃప్రశమం యాన్తి వ్యాసోబ్రుతే న సంశయః !! ౧౨ !!

!! ఇతి శ్రీ వేద వ్యాస విరచితమ్ ఆదిత్యాదీ నవగ్రహ స్తోత్రం సంపూర్ణం !!


Monday, March 4, 2019

శివరాత్రి ప్రార్థన



శివరాత్రివ్రతం వక్ష్యే భుక్తిముక్తిప్రదం శృణు !
మాఘఫాల్గునయోర్మధ్యే కృష్ణా యా తు చతుర్దశీ !!1
కామయుక్తా తు సోపోష్యా కుర్వన్‌ జాగరణం వ్రతీ !
శివరాత్రివ్రతం కుర్వే చతుర్దశ్యామభోజనమ్‌!! 2
రాత్రిజాగరణేనైవ పూజయామి శివం వ్రతీ !
ఆవాహయామ్యహం శమ్భుం భుక్తిముక్తిప్రదాయకమ్‌!! 3
నరకార్ణవకోత్తారనావం శివ నమోస్తుతే !
నమః శివాయ శాన్తాయ ప్రజారాజ్యాదిదాయినే!! 4
సౌభాగ్యారోగ్య విద్యార్థస్వర్గమార్గప్రదాయినే !
ధర్మం దేహి ధనం దేహి కామభోగాది దేహి మే!! 5
గుణకీర్తిసుఖం దేహి స్వర్గం మోక్షం చ దేహి మే !
లుబ్దకః ప్రాప్తవాన్‌ పుణ్యం పాపీ సున్దరసేనకః!! 6
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే శివరాత్రివ్రతం నామ త్రినవత్యధిక శతతమోధ్యాయః!!
-శంకరకింకర
శివరాత్రి ఉపవాసముండి రాత్రి జాగరము చేసి ఇట్లు కోరవలెను ''నేను చతుర్దశినాడు ఉపవాసముండి శివరాత్రి వ్రతము చేయుచుంటిని. నేను వ్రతముక్తుడనై రాత్రి జాగరము చేసి శివుని పూజ చేయుచున్నాను. భోగమోక్షములను ప్రసాదించు శివుని ఆవాహనము చేయుచున్నాను. శివా! నీవు సంసారనరకసముద్రమును దాటించు నౌకవంటివాడవు. నీకు నమస్కారము. నీవు సంతానమునురాజ్యమును ఇచ్చువాడవు. మంగళమయుడవు. శాంతస్వరూపుడవు. నీకు నమస్కారము. నీవు సౌభాగ్య - ఆరోగ్య - విద్యా - ధన - స్వర్గముల నిచ్చువాడవు. 

నాకుధర్మమునుధనమునుకామభోగాదులను ప్రసాదించుము. నన్ను గుణ - కీర్తి - సుఖసంపన్నునిగా అనుగ్రహించుము. దేహాంతమున నాకు స్వర్గ - మోక్షముల నిమ్ము''  - అగ్నిమహాపురాణము- శివరాత్రివ్రతము 193వ అధ్యాయము






Tuesday, February 19, 2019

ఉనికి - త్యాగం


దారం గుర్తింపు కోరుకుంటే దండ ఉనికిని కోల్పోతుంది.
పూలు వాడిపోయినా దారం అలాగే ఉండిపోతుంది

పునాది పైకి కనపడాలనుకుంటే భవనం నేలమట్టమౌతుంది.
భవనం మార్పులకి లోనైనా పునాది అలానే ఉండిపోతుంది.

త్యాగమే వాటి అమృతత్వానికి నాంది!

-శంకరకింకర