Pages

Thursday, February 20, 2020

శివరాత్రి ప్రార్థన



శివరాత్రివ్రతం వక్ష్యే భుక్తిముక్తిప్రదం శృణు ! మాఘఫాల్గునయోర్మధ్యే కృష్ణా యా తు చతుర్దశీ !!1
కామయుక్తా తు సోపోష్యా కుర్వన్‌ జాగరణం వ్రతీ ! శివరాత్రివ్రతం కుర్వే చతుర్దశ్యామభోజనమ్‌!! 2
రాత్రిజాగరణేనైవ పూజయామి శివం వ్రతీ ! ఆవాహయామ్యహం శమ్భుం భుక్తిముక్తిప్రదాయకమ్‌!! 3
నరకార్ణవకోత్తారనావం శివ నమోస్తుతే ! నమః శివాయ శాన్తాయ ప్రజారాజ్యాదిదాయినే!! 4
సౌభాగ్యారోగ్య విద్యార్థస్వర్గమార్గప్రదాయినే ! ధర్మం దేహి ధనం దేహి కామభోగాది దేహి మే!! 5
గుణకీర్తిసుఖం దేహి స్వర్గం మోక్షం చ దేహి మే ! లుబ్దకః ప్రాప్తవాన్‌ పుణ్యం పాపీ సున్దరసేనకః!! 6
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే శివరాత్రివ్రతం నామ త్రినవత్యధిక శతతమో೭ధ్యాయః!!
-శంకరకింకర
శివరాత్రి ఉపవాసముండి రాత్రి జాగరము చేసి ఇట్లు కోరవలెను ''నేను చతుర్దశినాడు ఉపవాసముండి శివరాత్రి వ్రతము చేయుచుంటిని. నేను వ్రతముక్తుడనై రాత్రి జాగరము చేసి శివుని పూజ చేయుచున్నాను. భోగమోక్షములను ప్రసాదించు శివుని ఆవాహనము చేయుచున్నాను. శివా! నీవు సంసారనరకసముద్రమును దాటించు నౌకవంటివాడవు. నీకు నమస్కారము. నీవు సంతానమును, రాజ్యమును ఇచ్చువాడవు. మంగళమయుడవు. శాంతస్వరూపుడవు. నీకు నమస్కారము. నీవు సౌభాగ్య - ఆరోగ్య - విద్యా - ధన - స్వర్గముల నిచ్చువాడవు. నాకు ధర్మమును, ధనమును, కామభోగాదులను ప్రసాదించుము. నన్ను గుణ - కీర్తి - సుఖసంపన్నునిగా అనుగ్రహించుము. దేహాంతమున నాకు స్వర్గ - మోక్షముల నిమ్ము''  - అగ్నిమహాపురాణము- శివరాత్రివ్రతము 193వ అధ్యాయము


Monday, December 23, 2019

చెట్లకీ మొక్కలకీ జీవముంటుందని సైన్స్ కనిపెట్టలేదు!


చెట్లకీ మొక్కలకీ జీవముంటుందని సైన్స్ కనిపెట్టలేదు. సైంటిఫిక్ గా వాళ్ల మెథడ్స్లో ప్రూవ్ చేయబడిందంతే... మా సనాతన ఆర్షధర్మంలో ఎన్నో లక్షల సంవత్సరాలనాడే చెప్పారు. ఓ తులసీ మమ్ములను కాపాడు, రావిచెట్టూ మమ్మల్ని కాపాడు, ఓ మేడీ నీదండం నాకు కావాలి అనుగ్రహించు, ఓ దర్భా నాదోషాలు తొలగించు, రక్షించు అని మన ఋషులు చెట్లతో, మొక్కలతో మాట్లాడి, ప్రార్థించి, వరాలు కూడా పొందారు. ఆ పరంపర మనకనుగ్రహించారు. కొన్నేళ్లు పోయాక పంచభూతాలలోనూ చైతన్యం ఉంది అని సైన్స్ ప్రూవ్ చేస్తుంది. మేము మాత్రం రోజూ సముద్రవసనే దేవి అంటూ మట్టికి (భూమాతకి క్షమార్పణ చెప్పి) నమస్కరించి నిద్రలేస్తూనే ఉంటాం.. వాయుదేవుణ్ణి పూజిస్తాం, పంచభూతాలనూ, ప్రకృతి మాతనూ పూజిస్తాం

సనాతన ధర్మానికి జయం
ఆర్ష ధర్మానికి జయం...

-శంకరకింకర


Saturday, December 7, 2019

సత్సంగమంటే!?

సత్సంగమా? సద్గోష్టియా? సాధక బృందమా?
ఎందరో పెద్దల జీవితాలు, మాటలు, బోధలు పరిశీలించినమీదట చాలా ఆలస్యంగా తెలుసుకున్నది అవగతమైనది శంకరులంతటివారు సత్సంగం ఎందుకు దుర్లభం అని చెప్పారో నన్న విషయం. షరా అన్ని విషయాలలోలాగే మనం చాలా చోట్ల ఒక పదానికి బదులు మరోపదం వాడేస్తుంటాం. సాధారణంగా అన్ని ధార్మిక సంఘాలు, దేవాలయాదులు, భక్త సంఘాలు మొదలైనవాటిని సత్సంగంగా పేర్కొంటూంటాం. నిజానికి అది సత్సంగం కాదు సద్గోష్టి / సాధనా సంగాలే. కొందరికి కొత్తగా కటువుగా అనిపించచ్చు... విచారణ చేయండి. సత్సంగంలో సత్ తో సంగం చేసామా లేక సత్ కొరకు గోష్టి జరిపామా? సమాధానం మనకే అవగతమౌతుంది.

అసలు మొట్టమొదట సత్సంగం అంటే ఏమిటో తెలుసుకోవాలి. ’సత్’ తో ’సంగం’ అంటే "సత్యంతో కలిసి ఉండడం లేదా సత్ ను ఎరిగినవారితో కలిసి ఉండడం = సత్సంగం".
ఆస్తికులై, భావ సారూప్యత కలిగిన వారందరూ ఒక బృందంగా కలిసి ఉండడం, చర్చించడం స్తుతి, పూజ, అర్చన, ధ్యానాది సాధనలు చేయడం ఇవన్నీ సద్గోష్టి బృందాలు లేదా సాధక బృందాల లెక్కకు వస్తాయి. ఆ బృందంలో ఎవరైనా సత్ తో సంగం ఉన్నవారు అనగా సత్యాన్ని ఎరిగినవారు ఉంటే అనగా ఒక ఋషి, ముని, హంస, పరమహంస, జ్ఞానంలో పండిన సత్యమెరుక గలవారుంటే అప్పుడు వారితో సంగం కలిగి ఉండడం సత్సంగం ఔతుంది. అలా కాకుండా ఆత్మ ఎరుక లేక, ఆత్మానాత్మ సందిగ్ధంలో ఉంటూ సాధన ప్రయత్నం సాగిస్తున్నవారుంటే అలాటి వారందరూ, అందులో ఉండే పెద్దలైన వేదశాస్త్రేతిహాస విషయ పరిజ్ఞానం ఉన్నవారితో సహా ఉన్నవారందరూ సాధకులే, కొందరు నాలుగుమెట్లు పెనున్నవారు కొందరు మెట్లెక్కడం మొదలెట్టినవారు! అలాంటి బృందాలన్నీ సద్గోష్టి / సాధనా సంగాలే...
-శంకరకింకర


* శిష్యులకు ఋషుల సత్సంగము, వారి సేవ, అవసరమంటారు ?
* వృత్తి రీత్యా నెక్కడో ఉండాలి, సాధువులు సమీపంలో ఉండటం కుదరదు.సత్సంగం లేకపోయినా ,నాకు సాక్షాత్కారం లభిస్తుందా ?
* సత్సంగం అవసరమా ? నేనిక్కడ కు రావటంవల్ల నా కేమైనా ప్రయోజనముంటుందా , ఉండదా - నేను తెలుసుకో గోరేది ఇదే.

మహర్షి !  మొదట సత్సంగం అంటే ఏమిటో తెలుసుకోవాలి నువ్వు. సత్ తో, అంటే  సత్యంతో కలిసి ఉండటమని దాని అర్థం.సత్ ని ఎరిగినవాడినీ,
గ్రహించినవాడినీ, కూడా సత్ అనే అంటారు.సత్ తోగాని, సత్ ని గ్రహించిన వానితో గానీ కలసి ఉండటం అనేది తప్పనిసరి అందరికీ. సంసారసాగరాన్ని  దాటించడానికి  సత్సంగం వంటి నౌక ముల్లోకాలలో వేరే  ఏమీ లేదన్నారు శంకరులు.

    సత్సంగమంటే - సత్ తో  కలసి ఉండటం.సత్ అంటే ఆత్మే. ప్రస్తుతం , ఆత్మే  సత్ అని తెలియకపోవటం వల్ల , ఆ జ్ఞానం కల ఋషి యొక్క సాంగత్యాన్ని  వెతుక్కుంటాం. అదే సత్సంగం. అంతర్ దృష్టి  కలుగుతుంది. సత్ సాక్షాత్కరిస్తుంది.

     !  నీ సహజ స్థితి లో ఉండు !  భగవాన్ శ్రీ రమణ 🌹🌹🌹🌹🌹

Collection from FB

Monday, December 2, 2019

భారత దేశంలో ఎవరుంటారు? భారత అంటే?


భారత దేశంలో ఎవరుంటారు? భారత అంటే?

భరతఖండంలో, భారతదేశంలో ఉండే సనాతనధర్మీయులకి పర్యాయ పదంగా మధ్య ప్రాచ్య, పశ్చిమ దేశాలు పెట్టుకున్నపేరు హిందు. హిందూ పదం ప్రాచీనం కాదు. అది రాజకీయ నామకరణం. సనాతన ధర్మీయులు సత్యాన్ని నమ్ముతారు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఈ దేశంలో వేదాలను నమ్మని చార్వాకులున్నా వారి సిద్ధాంతాన్ని వారు అనుసరించి సత్యాన్వేషణ చేసారు తప్ప మార్చలేదు. భారతీయ జీవన విధానం వేదవిహితమైన సత్యాన్వేషణం. అంటే "భాః, రతః," భాః = కాంతి, వెలుగు, జ్ఞానం దానియందు రతః = రమించేవారు. వారుండే ప్రదేశం భారతదేశం, వారు భారతీయులు. దానికి పర్యాయపదం వచ్చింది, ఇప్పుడు వికృతార్థాలకు తావిస్తున్న "హిందూ" పద (నిజానికి ’భారత’కు) నిర్వచనం.


-శంకరకింకర





Sunday, August 25, 2019

నఱకబడిన చెట్టు మళ్ళీ చిగురిస్తుంది

ఛిన్నోఽపి రోహతి తరుః క్షీణోప్యుపచీయతే పునశ్చన్ద్రః,
ఇతి విమృశన్తస్సన్తః సన్తవ్యన్తేన విప్లుతా లోకే!

నఱకబడిన చెట్టు మళ్ళీ చిగురిస్తుంది, కృష్ణపక్షంలో క్షీణించిన చంద్రుడు మళ్లీ వృద్ధి చెందుతాడు. ధీరులైన సజ్జనులు తమ కష్టాలకు మట్టిముద్దవలె కృంగిపోరు, దుఃఖమును దుఃఖముగా స్వీకరించి దానినధిగమించే ప్రయత్నం చేస్తారు.

-శంకరకింకర
[06/07, 11:49] Self: అసలొకరిని కించపరచడం అన్న భావన వచ్చినప్పుడే, ఆవ్యక్తి తనకు తానుగా కింద పడిపోయినట్లు. పైగా మత్సరంతోటీ, అసూయతోటీ ఉంటే ఎవరు బాగు చేయగలరు. అందుకే పెద్దలంటూంటారు.. రెండో మెట్టు మీదనుంచి జారి పడిపోతే ఇబ్బంది లేదు, 10వ మెట్టు మీదున్నవాడు జారితే కాస్త ప్రమాదం, 100 వ మెట్లు ఆ పై పై మెట్ల పై వాడు జర జరా జారి పడిపోతే.... అదీ భాగవతులు, ధార్మికులు యెడ ఆ ప్రవర్తన అలా ఉంటే... వాడి ఉన్నతి ఇక భగవంతుడే చూడాలి... అది కూడా అనుమానమే... ఏ పూర్వ పుణ్యమో గురువులో అడ్డుపడాలి.

శ్రీకృష్ణున్నాశ్రయిస్తే కలిగేదేమిటి?

శ్రీకృష్ణున్నాశ్రయిస్తే కలిగేదేమిటి?

ఎప్పటికో అప్పటికి
నష్టో మోహః
స్మృతిర్లబ్దః

ఏది నాది నాదనుకుని కూడబెట్టుకున్నావో ఆ మోహం పోతుంది!

ఎవరు నావాళ్లు నావాళ్లనుకున్నావో ఆ మోహం పోతుంది!

నేను, నాది, నావల్ల అన్నీ పోతాయ్, పోలేదంటే కృష్ణుడి అనుగ్రహం కలగలేదన్నట్లే!

ఆనక సంగ నిస్సంగమై మెల్లగా సత్యమూ అవగతమౌతుంది!

*కృష్ణం వందే జగద్గురుం*

Friday, June 14, 2019

పూజారి = పూజ+అరి అంటే "పూజకు శత్రువా"


ఆమధ్య ఎవరో పూజారి అనకూడదు తప్పు పూజారి అంటే పూజకు శత్రువు అన్నారట. అది తప్పుడు అన్వయం, భాష తెలీకపోవడం చేత ఏర్పడిన అయోమయం. పూజారి రెండు పదాల కలయిక కాదు.

అలాగే వంటరి కూడా. "వంటరి" అంటే "వంటచేసేవారు, పాచకుడు" అని నిఘంటు అర్థం. ఇది వృతి పని చేసేవారినుద్దేశించి ఉన్న పేర్లలో ఒకటి.  

కుమ్మరి, పూజారి, కమ్మరి, వంటరి ఇలా ఇవి ఏకపదాలు. ఇవి ఆయా వృత్తులు చేసేవారి పేర్లు.

ముర+అరి = మురారి లాగా ఇవి రెండు పదాల కలయిక కావు.

-శంకరకింకర

Thursday, June 13, 2019

రఘుపతి రాఘవ రాజారాం వక్రీకరణ

పెద్దగీతను చిన్నది చేయాలంటే.. దాని పక్కన ఇంకో పెద్దగీత గీయడం ఒక పద్ధతి. కానీ పెద్ద గీత గీయలేనితనం లేదా విషయంలేక గొప్పదిగా చూపడం కుదరకపోతే? అసలు పెద్దగీతని, గొప్పతనాన్ని చిన్నదిగా చూపడం... అనాదిగా మనిషి బలహీనత.. అదే జరిగిందిక్కడా...

-శంకరకింకర

రఘుపతి రాఘవ రాజారాం వక్రీకరణ

ఈ మాట వింటూనే నోటి వెంబడి పాట వస్తుంది.
రఘుపతి రాఘవ రాజారాం  పతిత పావన్ సీతా రాం
ఈశ్వర్ అల్లా తేరో నామ్ సబ్ కో సన్మతి దే భగవాన్
నిజానికి ఇది మన జాతి పితగా వ్యవహరింపబడే గాంధీ గారు అసలు భజనను మార్చి వ్రాసినది. ఇది భారతీయులందరి కొరకు వ్రాసినది అని చెబుతారు. విష్ణు దిగంబర్ పాలుస్కర్ గారు దీనిని పాడి ప్రచారములోనికి తెచ్చినారు. దీనికి మూలమగు భజన రచయిత మరుగున పడిపోయినారు, కానీ దీనిని హిందువులు తప్ప అన్యులు పాడుట అరుదు. ఇందులో క్రీస్తు పేరు లేదని క్రైస్తవులు పాడరు. రాముని పేరు వుందని ముస్లిములు పాడరు. మరి గాంధీ గారు ఎవరి కొరకు వ్రాసినారన్నది మీ ఊహకు వదులుతాను.

అసలు ఈ భజన పుట్టుపూర్వోత్తరములకు పోతే దీని మొదటి రెండు చరణములు నామరామాయణములోనివి. ఈ రెండు చరణములతో లక్ష్మణాచార్య గారు ఈ క్రింది భజనను వ్రాసినారు. చదువుతూ వుంటే అర్థమగుట లేదా లక్ష్మణాచార్యులవారు తెలుగువారని. ఎందుకంటే ఈ చిన్న భజనలో మన భద్రాద్రి రాముడు చోటు చేసుకొన్నాడు.

రఘుపతి రాఘవ రాజారాం
పతిత పావన సీతా రాం
సుందర విగ్రహ మేఘశ్యాం
గంగా తులసీ సాలగ్రాం
భద్రగిరీశ్వర సీతారాం
భక్త జనప్రియ సీతారాం
జానకి రమణా సీతారాం
జయ జయ రాఘవ రాజారాం 

-చెరుకు రామ మోహన్ రావు, Cheruku Rama Mohan Rao (Saturday, 23 December 2017)

Tuesday, June 11, 2019

అఙ్గారకస్తోత్రమ్

॥ అఙ్గారకస్తోత్రమ్ ॥

అస్య శ్రీ అఙ్గారకస్తోత్రస్య ।
విరూపాఙ్గిరస ఋషిః ।
అగ్నిర్దేవతా ।
గాయత్రీ ఛన్దః ।
భౌమప్రీత్యర్థం జపే వినియోగః ।
అఙ్గారకః శక్తిధరో లోహితాఙ్గో ధరాసుతః ।
కుమారో మఙ్గలో భౌమో మహాకాయో ధనప్రదః ॥ ౧॥

ఋణహర్తా దృష్టికర్తా రోగకృద్రోగనాశనః ।
విద్యుత్ప్రభో వ్రణకరః కామదో ధనహృత్ కుజః ॥ ౨॥

సామగానప్రియో రక్తవస్త్రో రక్తాయతేక్షణః ।
లోహితో రక్తవర్ణశ్చ సర్వకర్మావబోధకః ॥ ౩॥

రక్తమాల్యధరో హేమకుణ్డలీ గ్రహనాయకః ।
నామాన్యేతాని భౌమస్య యః పఠేత్సతతం నరః ॥ ౪॥

ఋణం తస్య చ దౌర్భాగ్యం దారిద్ర్యం చ వినశ్యతి ।
ధనం ప్రాప్నోతి విపులం స్త్రియం చైవ మనోరమామ్ ॥ ౫॥

వంశోద్ద్యోతకరం పుత్రం లభతే నాత్ర సంశయః ।
యోఽర్చయేదహ్ని భౌమస్య మఙ్గలం బహుపుష్పకైః ॥ ౬॥

సర్వా నశ్యతి పీడా చ తస్య గ్రహకృతా ధ్రువమ్ ॥ ౭॥

॥ ఇతి శ్రీస్కన్దపురాణే అఙ్గారకస్తోత్రం సంపూర్ణమ్ ॥