Pages

Friday, August 21, 2020

21 పత్రాల ప్రమాణం - ముఖ్య విషయం

నమస్తే

21 పత్రాల ప్రమాణం - ముఖ్య విషయం.


వినాయకుడికి ఏయే పత్రాలతోపూజించాలి అన్న మీమాంసలో కొన్ని కొన్ని చోట్ల కొందరు కొందరు పెద్దలు కొన్ని సంప్రదాయాలలో చేసుకుంటున్న వ్రత విధానం ప్రకారం  రెండు మూడు పత్రాలలో వ్యత్యాసం ఉంది. ఐతే మరి మేము ఏవి వాడాలి ఏపత్రాలతో పూజించాలి. ప్రముఖంగా తులసిపత్రంపైన ఈ సందేహం ఎక్కువ. శైవ సంప్రదాయస్తులు ఒకానొక పురాణోక్త మైన గణేశ తులసీ సంవాదాన్ని దృష్టిలో ఉంచుకొని తులసీ పత్రంతో పూజించరాదని చెప్తారు. కొందరు నేరేడు ఆకులతో పూజిస్తారు. ఔత్తరాహికులు కేతకీపత్రం అంటే మొగలి ఆకులతోపూజిస్తారు, అలాగే కొన్ని చోట్ల శ్వేత దూర్వ అంటే తెల్లగడ్డి, ఆగస్త్య పత్రం ఇలా వేర్వేరు పత్రాల మార్పులతో ఉంటుంది.  ఉత్తరభారతంలోనూ చలి దేశాల్లోనూ దేవదారు దొరుకుతుంది మనకి లభ్యంలో ఉండదు.


అలాగే ప్రాంతాలవారీగా బీజాపూరఫలం ఇష్టమని గింజలు ఎక్కువగా ఉండే జామ, దోసపండు, దోసకాయ, చిట్టడవులదగ్గర ఉండే ప్రాంతం వారు పంపరపనాస, మాదీఫలం వంటివి కూడా వాడడం కద్దు. కొన్ని చోట్ల దొరికితే పనస కూడా నివేదిస్తారు. తెలుగులో కుడుములు, ఉండ్రాళ్ళు, బూరెలు, ఔత్తరాహికుల మోదకాలు ఇవన్నీ ప్రాంతాచారాలను బట్టి మారిన ఒకే వంటయొక్క రూపాలు


ఐతే ఇవన్నీ మన శ్రద్ధ ప్రకటించడానికే. పైగా ఏ కల్పంలోనూ 21పత్రాలు అంటే ఇవే అని రూఢి లేదు. 

21 పత్రాలు

21 నామాలతో దూర్వాయుగ్మ పూజ

21 నేతి కుడుములతో (ఉండ్రాళ్ళ) నివేదన


//దైవీ గుణ సంపత్తి కలిగి 21 దోషాలను తొలగించి తద్వారా పాపఫలితాన్ని తీసి 21 రకాల నరకలోక బాధలను పడకుండా కాపాడమని. సాత్విక బుద్ధినిమ్మని, ప్రకృతి యెడల దైవీ భావనతో వ్యవహరిస్తామని, నివేదన బుద్ధితో వ్యవహరిస్తామని భగవంతుని దగ్గర చెప్పుకోవడమే ఈ 21 నామాలతో 21 దైవీ గుణ సంపత్తి కలిగిన పత్ర పూజ అంతరార్థం.//


పరంపరాగతంగా మీ ఇళ్ళలో మీ సంప్రదాయం ప్రకారం ఏయే పత్రాలతో పూజిస్తున్నారో వాటితోనే పూజించాలి. మీ ఇంటి ఆచారాన్ని వంశఆచారాన్ని అనుసరించి గతంలో మీపెద్దలు చేసిన విధంగా లేదా మీ ఇంటి పురోహితుడు సూచించిన విధంగా లేదా మీరు ఆశ్రయించిన స్వగురువు సూచన మేరకు ఆచరించాలి. ఇవేమీ మాకు తెలియదు అనుకుంటే, తేలిగ్గా స్కాంద పురాణాంతర్గతంగా వివరించి వ్రతకల్పంగా రూపొందించబడిన వ్రత విధానాన్ని వ్రతచూడామణి ఇత్యాది గ్రంథాలలో ప్రకటించారు దాని అనుసరించి చేసుకోవచ్చు. దీని గురించి పెద్ద అల్లరి పడనవసరంలేదు, మన ఆచారంలోలేని ఇతర ప్రాంత, సంప్రదాయ విషయాలను మనవాటిలో జొప్పించుకోనవసరంలేదు. తండ్రి యైన శివుడు ఆచార ప్రియుడు అని శివపురాణం చెప్తుంటే కొడుకైన గణపతి అదే పరంపరాగతమైన మార్గంలో చరిస్తే ఆనందిస్తాడు, బావుందనో, అందంగా చెప్పబడిందనో మరోమార్గంలోకి మళ్ళడం మంచిది కాదు.


-శంకరకింకర



Wednesday, August 12, 2020

సుదర్శన స్తోత్రం - అందరూ జపించవచ్చు

సుదర్శన మహాజ్వాలా కోటి సూర్య సమప్రభ!

అజ్ఞానాంధస్య మే దేవ విష్ణోర్మార్గం ప్రదర్శయ!!

Thursday, April 9, 2020

శ్రీమాతఙ్గీ స్తుతిః

శ్రీమాతఙ్గీ స్తుతిః 
మాతఙ్గీం నవయావకార్ద్ర చరణాముల్లాసి కృష్ణాంశుకాం
వీణాపుస్తక ధారిణీం నతకుచాం ముక్తాప్రవాలావలిమ్ ।
శ్యామాఙ్గీం శశిశఙ్ఖకుణ్డలధరాం దన్తప్రభాసుస్మితాం
ఆకర్ణాలక-వేణి-కఞ్జ-నయనాం ధ్యాయేచ్ఛుక శ్యామలామ్ ॥ ౧॥

కర్పూర శోభి కర్ణాభరణాభిరామాం మాణిక్యభూషాం సుముఖారవిన్దామ్ ।
హాలామదాఘూర్ణిత లోచనాభాం బాలాం భజే బాలతమాల నీలామ్ ॥ ౨॥

కస్తూరీ తిలకాభిరామ రచితా కర్పూర తాటఙ్కినీ
బాలా నీలవిశాలచారువదనా ప్రాలమ్బిధమ్మిల్లకా ।
హారోదఞ్చిత పీవరస్తనతటీ హాలామదోల్లాసినీ
శ్యామా కాచన మోహినీ విజయతే చఞ్చత్ప్రపఞ్చీకృతా ॥ ౩॥

అంశే వేణీం చికురకుసుమాం చూలికాం నీలచేలాం
ముక్తాభూషాఙ్కరయుగలతాం వల్లకీం వాదయన్తీమ్ ।
మాధ్వీమత్తాం మధుకర నినదాం శ్యామలాం కోమలాఙ్గీం
మాతఙ్గీం తాం సకలఫలదాం సన్తతం భావయామి ॥ ౪॥

వీణా పుస్తక ధారిణీం స్మితముఖీం తాలీదలాకల్పిత
స్ఫాయత్కుణ్డలభూషణాం కువలయశ్యామాం కురఙ్గీదృశీమ్ ।
ఉత్తుఙ్గస్తనకుమ్భయుగ్మ విలసత్కాశ్మీరపత్రావలీం
మాతఙ్గీం పదకైరవం నవచరచ్చన్ద్రాతపత్రామ్భజే ॥ ౫॥

ధ్యాయేహం రత్నపీఠేశుకకులరణితం శృణ్వతీం శ్యామలాఙ్గీం
న్యస్తైకాఘ్రిం సరోజే శశిశకలధరాం వల్లకీంవాదయన్తీమ్ ।
కల్హ్నారాబద్ధమాలాం నియమితవిలసచ్చూలికాం రక్తవస్త్రాం
మాతఙ్గీం శఙ్ఖపాత్రాం మధుమదవివశాం చిత్రకోద్భాసిభాలామ్ ॥ ౬॥

ఆరాధ్యమానాశ్చరణాం పిబన్తోబ్రహ్మాదయో విశ్రుత కీర్తిమాపుః ।
అన్యేపరం వాగ్విభవం మునీన్ద్రా పరాంశ్రియం భక్తిభరేణ చాన్యే ॥ ౭॥

నమామి దేవీం నవచన్ద్రమౌలిం మాతఙ్గినీం చన్ద్రకలావతంసామ్ ।
ఆమ్నాయ వాక్యైః ప్రతిపాదనార్థే ప్రబోధయన్తీం శుకమాదరేణ ॥ ౮॥

మాతఙ్గలీలా గమనేఽపి భక్త్యా శిఞ్జానమఞ్జీరమిషాద్భజన్తి ।
మాతస్త్వదీయం చరణారవిన్దమకృత్రిమాణాం వచసాం నిరిచ్ఛాః । ౯॥।

పరాధికాశిఞ్జితనూపురాభ్యాం కృతాగమాం పదవీం తాం పదాభ్యామ్ ।
ఆస్ఫోటయన్తీం కరవల్లకీం తాం మాతఙ్గినీం మద్ధృదయే భజామి ॥ ౧౦॥

నీలాంశుకాబద్ధనితమ్బబిమ్బాం నాలీదలేనానతకర్ణభూషామ్ ।
మధ్యే మదాఘూర్ణిత నేత్రపద్మాం మాతఙ్గినీం శమ్భువధూం నమామి ॥ ౧౧॥

నీలోత్పలానాం శ్రియమావహన్తీం కాఞ్చ్యా కటాక్షైకశుభాం కరాణామ్ ।
కదమ్బ మాలాఙ్కితకేశపాశాం మాతఙ్గకన్యాం హృదిభావయామి ॥ ౧౨॥

స్తుత్యానయా శఙ్కరధర్మపత్నీం మాతఙ్గినీం వాగధిదేవతాం తామ్ ।
స్వర్గంగతిం భక్తజనా మనుష్యాః పరాం శ్రియం భక్తి భరేణ చాన్యే ॥ ౧౩॥

కుచకుమ్భ తటన్యస్త మణివీణామదాలసామ్ ।
శ్యామాం వామాఙ్క విన్యస్త మాలికాం బాలికామ్భజే ॥ ౧౪॥

అబ్ధౌయాతి సరోజచామరమరుద్దోధూయమానాలకా
చూలీచుమ్బిత చారుచమ్పక దలాగౌరీ మదోల్లాసినీ ।
నాలీ బాల పలాశ కర్ణవిలసత్కల్లోల కాలిచ్ఛటా
కాలీ సాచలకన్యకా విజయతే మచ్చిత్త పద్మాసనా ॥ ౧౫॥

వీణానర్తిత పాణి పఙ్కజయుగామాశోణబిమ్బాధరాం
వేణీ బద్ధ కదమ్బ పుష్ప కలికామేణీ విలోలేక్షణామ్ ।
శ్రోణీ లమ్బ విరాజమాన సుజపా శోణామ్బరాలఙ్కృతాం
ఏణాఙ్కార్క విభూషణాం కలయతాం భిల్లీం పురన్ధ్రీమ్భజే ॥ ౧౬॥

తమాల శ్యామాఙ్గీమతిమధుర సఙ్గీత నిరతాం
కృపాపూర్ణాపాఙ్గీం కుచభర నతాఙ్గీం స్మితముఖీమ్ ।
భ్రమద్భ్రూభఙ్గే తే వివిధ కుసుమైస్తైరివయుతాం
భజేఽహం మాతఙ్గీం మదపరవశాఙ్గీమనుదినమ్ ॥ ౧౭॥

సుకశ్యామాం శ్యామాం శుకరణిత కల్లోల నిరతాం
విపఞ్చీ సఞ్చారారుణ కరసరోజాం భగవతీమ్ ।
మదాసక్తాముక్తా ఫలగుణితహారస్తనతటాం
కృపావాసామీశామతిరుచిరహాసాం భజశివామ్ ॥ ౧౮॥

రక్తారవిన్ద మకరన్ద రసానులేపాం
పానప్రమత్త చలితాలి కులాలకాన్తామ్ ।
వీణామనోహరనినాదవినోదశీలాం
వాణీం భజే శుకనిభాం మధుపాన లోలామ్ ॥ ౧౯॥

సఙ్గీత నాద రసపానఘనార్ద్రదేహాం
నేత్రారవిన్ద కరుణామృతవాహినీం తామ్ ।
రక్తారవిన్ద వినివేశితవామపాదాం
శ్యామాం మతఙ్గతనయాం మనసా స్మరామి ॥ ౨౦॥

కస్తూరికా శ్యామల కోమలాఙ్గీం
కాదమ్బరీపానమదాలసాఙ్గీమ్ ।
వామస్తనాలిఙ్గితరత్నవీణాం
మాతఙ్గకన్యాం మనసాస్మరామి ॥ ౨౧॥

స్మరేత్ప్రథమ పుష్పిణీం రుధిరబిన్దు నీలామ్బరాం
గృహీతమధుపాత్రికాం మదవిఘూర్ణ నేత్రోజ్వలామ్ ।
ఘనస్తనభరానతాం గలిత చూలికాం శ్యామలాం
కరస్ఫురిత వల్లకీం విమలశఙ్ఖ తాటఙ్కినీమ్ ॥ ౨౨॥

మాణిక్యవీణాముపలాలయన్తీం మదాలసాం మఞ్జుల వాగ్విలాసామ్ ।
మాహేన్ద్ర నీలోత్పల కోమలాఙ్గీం మాతఙ్గ కన్యాం మనసాస్మరామి ॥ ౨౩॥

కువలయ దలనీలాఙ్గీం కువలయ చారుచఞ్చలాపాఙ్గీమ్ ।
కువలయ సమోత్తమాఙ్గీం కువలయ చూలీం నమామి మాతఙ్గీమ్ ॥ ౨౪॥

శ్యామా కువలయశ్యామా నామకలాధామ భాగస్థా ।
మధుపానరతారతాపాయాద్వాణీ వీణావినోదవిశ్రాన్తా ॥ ౨౫॥

తమాలపత్రాఞ్చితనీలగాత్రీం తాలీదలేనార్పిత కర్ణపత్రామ్ ।
సప్తస్వరాలాపవిశేషతన్త్రీం బాలామ్భజే భవ్యమతఙ్గపుత్రీమ్ ॥ ౨౬॥

నిత్యానుపాత్రార్పితసత్కలాభాం నీలామ్బరోద్భాసినితమ్బబిమ్బామ్ ।
భక్తోపరిన్యస్తకృపావలమ్బాం బాలాం భజే భవ్యగుణాం మదమ్బామ్ ॥ ౨౭॥

శివతనుభవసఙ్గం శివచూలీ లోల చఞ్చలోత్సఙ్గమ్ ।
కలిమల తనుమఙ్గం కలయే మాతఙ్గకన్యకాపాఙ్గమ్ ॥ ౨౮॥

కలాధీశోత్తంసాం కరకలిత వీణాహితరసాం
కలిన్దాపత్యాభాం కరకలిత హృదయాం రక్తవసనామ్ ।
పురాణీం కల్యాణీం  పురమథనపుణ్యోదయకలా-
మధీరాక్షీం వన్దే బహుకుసుమసన్నద్ధకబరీమ్ ॥ ౨౯॥

కలోదఞ్చద్వేణీం కనకదలతాటఙ్కమహితాం
స్తనాభ్యామానమ్రాం తరుణమిహిరాం రక్తవసనామ్ ।
మహాకల్యాణీం తన్మధుమదభరాం తామ్రనయనాం
తమాలశ్యామాం నస్తవకయతు సౌఖ్యానిసతతమ్ ॥ ౩౦॥

కరాఞ్చితవిపఞ్చికాం కలితచన్ద్రచూడామణిం
కపోలవిలసన్మహాకనకపత్ర తాటఙ్కినీమ్ ।
తపః ఫలమిహాశ్రితాం తరుణభాసరక్తామ్బరాం
తమాలదలమేచకాం తరుణలోచనామాశ్రయే ॥ ౩౧॥

మాతా మరకతశ్యామా మాతఙ్గీ మధుశాలినీ ।
కటాక్షయతు కల్యాణీ కదమ్బవనవాసినీ ॥ ౩౨॥

జగదానన్దకలఙ్కకణ్ఠమాలా కబరీ వేష్టన కాఙ్క్షణీయ గుఞ్జా ।
కురుతాం దురితాద్విమోక్షణం మే తుహినా భిల్లికుటుమ్బినీ భవానీ ॥ ౩౩॥

వామే విస్మృతశాలినీ స్తనతటే విన్యస్త వీణాముఖం
తన్త్రీతాల విరావిణీమసకలైరాస్ఫాలయన్తీ నఖైః ।
అర్ధోన్మీలిత లోచనం సవిలసద్గ్రీవం ముఖంవిభ్రతీ
శ్యామా కాచన మోహినీ విజయతే మాతఙ్గకన్యామయి ॥ ౩౪॥

ప్రతిష్ఠా పయోధర ప్రసార కరపఙ్కజం బలభిదః ।
కదమ్బ వనమాలికం శశికలా సముద్భాసితమ్ ॥ ౩౫॥

మతఙ్గ కులనన్దినీ మనసి మే ముహుజృమ్భతామ్ ।
సమస్త సుఖదాయినీ తరుణపత్ర తాటఙ్కినీ ॥ ౩౬॥

లాక్షారాగ కపోలపల్లవరతామాపీన తుఙ్గస్తనీం
కర్పూరోజ్వలచారుశఙ్ఖవలయాం కాశ్మీరరక్తాంశుకామ్ ।
తన్త్రీతాలసపాటలాం గులిదలాం వన్దామహే మాతరం
మాతఙ్గీం మదమన్థరాం మరకతశ్యామాం మనోహారిణీమ్ ॥ ౩౭॥

స్రస్తం కేతకిదామభిర్వలయితం ధమ్మిల్లమాబిభ్రతీ
తాలీపత్ర పుటాన్తరైః సమనతైస్తాటఙ్కినీ మౌక్తికైః ।
భాలే కల్పతరోః ప్రసూనవిలసదృష్ట్వైవ సమ్మోహినీ
కాఞ్చీ దామవతీ విజయతే వీణాసవాదాననా ॥ ౩౮॥

మాతఙ్గీం భూషితాఙ్గీం మధుమదముదితాం ఘూర్ణమానాక్షియుగ్మాం
స్విద్యద్వక్త్రాం కదమ్బ ప్రవిలసద్వేణికామత్త వీణామ్ ।
బిమ్బోష్ఠీం రక్తవస్త్రాం మృగమద తిలకామిన్దురేఖావతంసాం
కర్ణోద్యచ్ఛఙ్ఖపత్రాం కరకలితశుకాం నౌమి తుఙ్గస్తనీం తామ్ ॥ ౩౯॥

ఉన్మీలిద్యావకాద్యాన్నివిడమదభరోద్విగ్నభాలాలకాశాం
రత్నగైవేయహారాఙ్గద కటిలసత్సూత్ర మఞ్జీరఘోషామ్ ।
ఆనీయార్థానభీష్టాన్ స్మితమధురదృశా సాధికం తర్పయన్తీం
ధ్యాయేద్దేవీం శుకాభాంశుకమఖిలకలారూపమస్యాశ్చపార్శ్వే ॥ ౪౦॥

వేణీమూల విలాసితేన్దు శకలాం వీణానినాదప్రియాం
క్షోణీపాల సురేన్ద్ర పన్నగగణై రారాధితాఙ్ఘ్రిద్వయామ్ ।
ఏణీచఞ్చలలోచనాం సువదనాం వాణీం పురాణోజ్వలాం
శ్రోణీభారభరాలసామనిమిషాం పశ్యామి విశ్వేశ్వరీమ్ ॥ ౪౧॥

కుచకలశనిషణ్ణవీణాం కలమధురధ్వని కమ్పితోత్తమాఙ్గీమ్ ।
మరకతమణిభాగమేచకాభాంమదమవిరోధమనస్వినీముపాసే ॥ ౪౨॥

తాలీదలోల్లసితకోమలకర్ణపాలీం ఫాలాన్తరాచికురామతినీలవేణీమ్ ।
వక్షోజపీఠనిహితోజ్వలచారువీణాం శ్యామాం నమామి మదిరారుణనేత్రయుగ్మామ్ ॥ ౪౩॥

మధ్యేబద్ధమయూఖపిచ్ఛనికరాం శ్యామామ్ప్రబాలాధరాం
భృఙ్గీవాదనతత్పరాం సునయనాం మూర్ధాలకైర్బర్బరామ్ ।
గుఞ్జాహారధరాం సమున్నతకుచాం చన్ద్రాననాం శామ్భవీం
భిల్లీ వేషధరాం నమామి శబరీ తామేకవీరాం పరామ్ ॥ ౪౪॥

లసత్గుఞ్జాహార స్తనభర సమున్మధ్యలతికా
ముదఞ్చత్స్వేదామ్భః క్షణగణిత ఫేనోద్గమ రుచిమ్ ।
శివం శాన్తం పాత్రప్రవణమృగయాకారకరణం
శివామమ్బజ్ఞాతిం చరణమహమన్వేమిశరణమ్ ॥ ౪౫॥

నటదగుఞ్జా పఞ్జాభరణకిరణాం రక్తవసనాం
జపాకర్ణాభూషాం శిఖివరక్షకలాపామ్బరవతీమ్ ।
నదజ్ఝల్లీ వల్లీనవకిసలయైస్తాం పరివృతాం
నవామోహారూఢాం కుటిలకబరీం మోహశబరీమ్ ॥ ౪౬॥

గలే గుఞ్జా పుఞ్జావలి మపి చ కర్ణే శిఖిశిఖాం
శిరో రఙ్గే నృత్యత్కనకదల దూబ మఞ్జులదలమ్ ।
ధనుర్వామే చాపే శరమపరపాణౌ నిదధతీం
నితమ్బే బర్హాలిం కుటిలకబరీం నౌమి శబరీమ్ ॥ ౪౭॥

వీణావాదన నిరతం తల్లీలా బద్ధగీత వామకుచమ్ ।
శ్యామల కోమల గాత్రం పాటలనయనం పరం భజేధామ ॥ ౪౮॥

అఙ్కిత పాణిచతుష్ట్యమఙ్కుశపాశేక్షు చాపశకలమ్ ।
శఙ్కర జితేత్యమిత్రం పఙ్కజనేత్రం పరం భజేధామ ॥ ౪౯॥

కరకలిత కేసారాలానుకారేయం కుచకలశా జయతే జగతామ్ ।
మాతామాతఙ్గీ మఙ్గేస్వాయతనా ॥ ౫౦॥

ముదాకరకదమ్బ కాననే కనకమష్టపాత్రస్థితే
లసన్మణిమయాసనే సహచరీభిరారాధితామ్ ।
లసత్కనకకఙ్కణాం రజతమఞ్జుమఞ్జీరకాం
జగజ్జనవిమోహినీం జపవిధౌ స్మరేదమ్బికామ్ ॥ ౫౧॥

అకృశా కుచయోర్విలగ్నే విపులం వక్షసి విస్తృతం నితమ్బే ।
అరుణాధరమావిరస్తుచిత్తే కరుణాశాలి కపాలి భాగధేయమ్ ॥ ౫౨॥

వీణాతాల వినోదగీత నిరతాం నీలాంశుకోల్లాసినీం ।
బిమ్బోష్ఠీం నవయావకార్ద్ర చరణామాకీర్ణ కేశోజ్వలామ్ ॥ ౫౩॥

హృద్యావేశిత శఙ్ఖకుణ్డలధరాం మాణిక్యభూషోజ్వలాం
మాతఙ్గీం ప్రణతోఽస్మి సుస్మితముఖాం దేవీంశుకశ్యామలామ్ ॥ ౫౪॥

దివ్యహాలామదోన్మత్తాం దివ్యభూషణభూషితామ్ ।
దివ్యగన్ధర్వకన్యాభిస్సమారాధితపాదుకామ్ ॥ ౫౫॥

దివ్యసింహాసనాసీనాం శుకవీణాలసత్కరామ్ ।
సఙ్గీత మాతృకాం వన్దే వరదాం సుస్మితాననామ్ ॥ ౫౬॥

స్తుతిషు నవదేవ దేవి వివిధ కవి విలోహితమతిర్భవతి ।
నిహితమతిర్యద్యపి మామపేతచేతీభవతి స్తోతుం విలోభయతి ॥ ౫౭॥

సాధ్యాక్షరగర్భిత పఞ్చనవ ఇత్యక్షరాత్మికే జగన్మాతః ।
భగవతి మాతఙ్గేశ్వరి నమస్తుభ్యం మహాదేవి ॥ ౫౮॥

ఇత్యుమా సాహచర్యా భగవాన్మాతఙ్గఋషిప్రణీతా ఇయం స్తుతిః సమాప్తా ।


Add caption

Wednesday, March 25, 2020

శార్వరి

శార్వరి - అర్థరాత్రికటిక చీకటిమరోపేరే నిశారూప దుర్గ -

రుద్రో దివా ఉమా రాత్రిః తస్మై తస్యై నమోనమః...

ఆ దుర్గ కాళీ చండీ ప్రపంచాన్ని కాపాడడానికి కాలంలో శార్వరి రూపంలో వేంచేయబోతున్నది.... ఆహ్వానించి పూజించి శరణొంది రక్షణనొందుదాం..

-శంకరకింకర



Tuesday, March 24, 2020

శార్వరి సంవత్సరాది నుండి 21 రోజులు లాక్డౌన్

అవరోధాలనే అవకాశంగా మలచుకునే సాధకుల సాధనకు మంచి అవకాశం, శార్వరి సంవత్సరాది నుండి 21 రోజులు ఆధ్యాత్మిక సాధన చేసుకోడానికెంతవీలో... జపం తపం అనుష్ఠానం పారాయణ సాధన.. 21 రోజులు మనని మనం కొంత మార్చుకునే సమయంఅభివృద్ధిపరచుకునే సమయంలోకానికి తపస్సు ధారపోసే త్యాగాన్ని అలవాటు చేసుకునే సమయం...

-శంకరకింకర



Thursday, February 20, 2020

శివరాత్రి ప్రార్థన



శివరాత్రివ్రతం వక్ష్యే భుక్తిముక్తిప్రదం శృణు ! మాఘఫాల్గునయోర్మధ్యే కృష్ణా యా తు చతుర్దశీ !!1
కామయుక్తా తు సోపోష్యా కుర్వన్‌ జాగరణం వ్రతీ ! శివరాత్రివ్రతం కుర్వే చతుర్దశ్యామభోజనమ్‌!! 2
రాత్రిజాగరణేనైవ పూజయామి శివం వ్రతీ ! ఆవాహయామ్యహం శమ్భుం భుక్తిముక్తిప్రదాయకమ్‌!! 3
నరకార్ణవకోత్తారనావం శివ నమోస్తుతే ! నమః శివాయ శాన్తాయ ప్రజారాజ్యాదిదాయినే!! 4
సౌభాగ్యారోగ్య విద్యార్థస్వర్గమార్గప్రదాయినే ! ధర్మం దేహి ధనం దేహి కామభోగాది దేహి మే!! 5
గుణకీర్తిసుఖం దేహి స్వర్గం మోక్షం చ దేహి మే ! లుబ్దకః ప్రాప్తవాన్‌ పుణ్యం పాపీ సున్దరసేనకః!! 6
ఇత్యాది మహాపురాణే ఆగ్నేయే శివరాత్రివ్రతం నామ త్రినవత్యధిక శతతమో೭ధ్యాయః!!
-శంకరకింకర
శివరాత్రి ఉపవాసముండి రాత్రి జాగరము చేసి ఇట్లు కోరవలెను ''నేను చతుర్దశినాడు ఉపవాసముండి శివరాత్రి వ్రతము చేయుచుంటిని. నేను వ్రతముక్తుడనై రాత్రి జాగరము చేసి శివుని పూజ చేయుచున్నాను. భోగమోక్షములను ప్రసాదించు శివుని ఆవాహనము చేయుచున్నాను. శివా! నీవు సంసారనరకసముద్రమును దాటించు నౌకవంటివాడవు. నీకు నమస్కారము. నీవు సంతానమును, రాజ్యమును ఇచ్చువాడవు. మంగళమయుడవు. శాంతస్వరూపుడవు. నీకు నమస్కారము. నీవు సౌభాగ్య - ఆరోగ్య - విద్యా - ధన - స్వర్గముల నిచ్చువాడవు. నాకు ధర్మమును, ధనమును, కామభోగాదులను ప్రసాదించుము. నన్ను గుణ - కీర్తి - సుఖసంపన్నునిగా అనుగ్రహించుము. దేహాంతమున నాకు స్వర్గ - మోక్షముల నిమ్ము''  - అగ్నిమహాపురాణము- శివరాత్రివ్రతము 193వ అధ్యాయము


Monday, December 23, 2019

చెట్లకీ మొక్కలకీ జీవముంటుందని సైన్స్ కనిపెట్టలేదు!


చెట్లకీ మొక్కలకీ జీవముంటుందని సైన్స్ కనిపెట్టలేదు. సైంటిఫిక్ గా వాళ్ల మెథడ్స్లో ప్రూవ్ చేయబడిందంతే... మా సనాతన ఆర్షధర్మంలో ఎన్నో లక్షల సంవత్సరాలనాడే చెప్పారు. ఓ తులసీ మమ్ములను కాపాడు, రావిచెట్టూ మమ్మల్ని కాపాడు, ఓ మేడీ నీదండం నాకు కావాలి అనుగ్రహించు, ఓ దర్భా నాదోషాలు తొలగించు, రక్షించు అని మన ఋషులు చెట్లతో, మొక్కలతో మాట్లాడి, ప్రార్థించి, వరాలు కూడా పొందారు. ఆ పరంపర మనకనుగ్రహించారు. కొన్నేళ్లు పోయాక పంచభూతాలలోనూ చైతన్యం ఉంది అని సైన్స్ ప్రూవ్ చేస్తుంది. మేము మాత్రం రోజూ సముద్రవసనే దేవి అంటూ మట్టికి (భూమాతకి క్షమార్పణ చెప్పి) నమస్కరించి నిద్రలేస్తూనే ఉంటాం.. వాయుదేవుణ్ణి పూజిస్తాం, పంచభూతాలనూ, ప్రకృతి మాతనూ పూజిస్తాం

సనాతన ధర్మానికి జయం
ఆర్ష ధర్మానికి జయం...

-శంకరకింకర


Saturday, December 7, 2019

సత్సంగమంటే!?

సత్సంగమా? సద్గోష్టియా? సాధక బృందమా?
ఎందరో పెద్దల జీవితాలు, మాటలు, బోధలు పరిశీలించినమీదట చాలా ఆలస్యంగా తెలుసుకున్నది అవగతమైనది శంకరులంతటివారు సత్సంగం ఎందుకు దుర్లభం అని చెప్పారో నన్న విషయం. షరా అన్ని విషయాలలోలాగే మనం చాలా చోట్ల ఒక పదానికి బదులు మరోపదం వాడేస్తుంటాం. సాధారణంగా అన్ని ధార్మిక సంఘాలు, దేవాలయాదులు, భక్త సంఘాలు మొదలైనవాటిని సత్సంగంగా పేర్కొంటూంటాం. నిజానికి అది సత్సంగం కాదు సద్గోష్టి / సాధనా సంగాలే. కొందరికి కొత్తగా కటువుగా అనిపించచ్చు... విచారణ చేయండి. సత్సంగంలో సత్ తో సంగం చేసామా లేక సత్ కొరకు గోష్టి జరిపామా? సమాధానం మనకే అవగతమౌతుంది.

అసలు మొట్టమొదట సత్సంగం అంటే ఏమిటో తెలుసుకోవాలి. ’సత్’ తో ’సంగం’ అంటే "సత్యంతో కలిసి ఉండడం లేదా సత్ ను ఎరిగినవారితో కలిసి ఉండడం = సత్సంగం".
ఆస్తికులై, భావ సారూప్యత కలిగిన వారందరూ ఒక బృందంగా కలిసి ఉండడం, చర్చించడం స్తుతి, పూజ, అర్చన, ధ్యానాది సాధనలు చేయడం ఇవన్నీ సద్గోష్టి బృందాలు లేదా సాధక బృందాల లెక్కకు వస్తాయి. ఆ బృందంలో ఎవరైనా సత్ తో సంగం ఉన్నవారు అనగా సత్యాన్ని ఎరిగినవారు ఉంటే అనగా ఒక ఋషి, ముని, హంస, పరమహంస, జ్ఞానంలో పండిన సత్యమెరుక గలవారుంటే అప్పుడు వారితో సంగం కలిగి ఉండడం సత్సంగం ఔతుంది. అలా కాకుండా ఆత్మ ఎరుక లేక, ఆత్మానాత్మ సందిగ్ధంలో ఉంటూ సాధన ప్రయత్నం సాగిస్తున్నవారుంటే అలాటి వారందరూ, అందులో ఉండే పెద్దలైన వేదశాస్త్రేతిహాస విషయ పరిజ్ఞానం ఉన్నవారితో సహా ఉన్నవారందరూ సాధకులే, కొందరు నాలుగుమెట్లు పెనున్నవారు కొందరు మెట్లెక్కడం మొదలెట్టినవారు! అలాంటి బృందాలన్నీ సద్గోష్టి / సాధనా సంగాలే...
-శంకరకింకర


* శిష్యులకు ఋషుల సత్సంగము, వారి సేవ, అవసరమంటారు ?
* వృత్తి రీత్యా నెక్కడో ఉండాలి, సాధువులు సమీపంలో ఉండటం కుదరదు.సత్సంగం లేకపోయినా ,నాకు సాక్షాత్కారం లభిస్తుందా ?
* సత్సంగం అవసరమా ? నేనిక్కడ కు రావటంవల్ల నా కేమైనా ప్రయోజనముంటుందా , ఉండదా - నేను తెలుసుకో గోరేది ఇదే.

మహర్షి !  మొదట సత్సంగం అంటే ఏమిటో తెలుసుకోవాలి నువ్వు. సత్ తో, అంటే  సత్యంతో కలిసి ఉండటమని దాని అర్థం.సత్ ని ఎరిగినవాడినీ,
గ్రహించినవాడినీ, కూడా సత్ అనే అంటారు.సత్ తోగాని, సత్ ని గ్రహించిన వానితో గానీ కలసి ఉండటం అనేది తప్పనిసరి అందరికీ. సంసారసాగరాన్ని  దాటించడానికి  సత్సంగం వంటి నౌక ముల్లోకాలలో వేరే  ఏమీ లేదన్నారు శంకరులు.

    సత్సంగమంటే - సత్ తో  కలసి ఉండటం.సత్ అంటే ఆత్మే. ప్రస్తుతం , ఆత్మే  సత్ అని తెలియకపోవటం వల్ల , ఆ జ్ఞానం కల ఋషి యొక్క సాంగత్యాన్ని  వెతుక్కుంటాం. అదే సత్సంగం. అంతర్ దృష్టి  కలుగుతుంది. సత్ సాక్షాత్కరిస్తుంది.

     !  నీ సహజ స్థితి లో ఉండు !  భగవాన్ శ్రీ రమణ 🌹🌹🌹🌹🌹

Collection from FB

Monday, December 2, 2019

భారత దేశంలో ఎవరుంటారు? భారత అంటే?


భారత దేశంలో ఎవరుంటారు? భారత అంటే?

భరతఖండంలో, భారతదేశంలో ఉండే సనాతనధర్మీయులకి పర్యాయ పదంగా మధ్య ప్రాచ్య, పశ్చిమ దేశాలు పెట్టుకున్నపేరు హిందు. హిందూ పదం ప్రాచీనం కాదు. అది రాజకీయ నామకరణం. సనాతన ధర్మీయులు సత్యాన్ని నమ్ముతారు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఈ దేశంలో వేదాలను నమ్మని చార్వాకులున్నా వారి సిద్ధాంతాన్ని వారు అనుసరించి సత్యాన్వేషణ చేసారు తప్ప మార్చలేదు. భారతీయ జీవన విధానం వేదవిహితమైన సత్యాన్వేషణం. అంటే "భాః, రతః," భాః = కాంతి, వెలుగు, జ్ఞానం దానియందు రతః = రమించేవారు. వారుండే ప్రదేశం భారతదేశం, వారు భారతీయులు. దానికి పర్యాయపదం వచ్చింది, ఇప్పుడు వికృతార్థాలకు తావిస్తున్న "హిందూ" పద (నిజానికి ’భారత’కు) నిర్వచనం.


-శంకరకింకర