Pages

Monday, December 23, 2019

చెట్లకీ మొక్కలకీ జీవముంటుందని సైన్స్ కనిపెట్టలేదు!


చెట్లకీ మొక్కలకీ జీవముంటుందని సైన్స్ కనిపెట్టలేదు. సైంటిఫిక్ గా వాళ్ల మెథడ్స్లో ప్రూవ్ చేయబడిందంతే... మా సనాతన ఆర్షధర్మంలో ఎన్నో లక్షల సంవత్సరాలనాడే చెప్పారు. ఓ తులసీ మమ్ములను కాపాడు, రావిచెట్టూ మమ్మల్ని కాపాడు, ఓ మేడీ నీదండం నాకు కావాలి అనుగ్రహించు, ఓ దర్భా నాదోషాలు తొలగించు, రక్షించు అని మన ఋషులు చెట్లతో, మొక్కలతో మాట్లాడి, ప్రార్థించి, వరాలు కూడా పొందారు. ఆ పరంపర మనకనుగ్రహించారు. కొన్నేళ్లు పోయాక పంచభూతాలలోనూ చైతన్యం ఉంది అని సైన్స్ ప్రూవ్ చేస్తుంది. మేము మాత్రం రోజూ సముద్రవసనే దేవి అంటూ మట్టికి (భూమాతకి క్షమార్పణ చెప్పి) నమస్కరించి నిద్రలేస్తూనే ఉంటాం.. వాయుదేవుణ్ణి పూజిస్తాం, పంచభూతాలనూ, ప్రకృతి మాతనూ పూజిస్తాం

సనాతన ధర్మానికి జయం
ఆర్ష ధర్మానికి జయం...

-శంకరకింకర


Saturday, December 7, 2019

సత్సంగమంటే!?

సత్సంగమా? సద్గోష్టియా? సాధక బృందమా?
ఎందరో పెద్దల జీవితాలు, మాటలు, బోధలు పరిశీలించినమీదట చాలా ఆలస్యంగా తెలుసుకున్నది అవగతమైనది శంకరులంతటివారు సత్సంగం ఎందుకు దుర్లభం అని చెప్పారో నన్న విషయం. షరా అన్ని విషయాలలోలాగే మనం చాలా చోట్ల ఒక పదానికి బదులు మరోపదం వాడేస్తుంటాం. సాధారణంగా అన్ని ధార్మిక సంఘాలు, దేవాలయాదులు, భక్త సంఘాలు మొదలైనవాటిని సత్సంగంగా పేర్కొంటూంటాం. నిజానికి అది సత్సంగం కాదు సద్గోష్టి / సాధనా సంగాలే. కొందరికి కొత్తగా కటువుగా అనిపించచ్చు... విచారణ చేయండి. సత్సంగంలో సత్ తో సంగం చేసామా లేక సత్ కొరకు గోష్టి జరిపామా? సమాధానం మనకే అవగతమౌతుంది.

అసలు మొట్టమొదట సత్సంగం అంటే ఏమిటో తెలుసుకోవాలి. ’సత్’ తో ’సంగం’ అంటే "సత్యంతో కలిసి ఉండడం లేదా సత్ ను ఎరిగినవారితో కలిసి ఉండడం = సత్సంగం".
ఆస్తికులై, భావ సారూప్యత కలిగిన వారందరూ ఒక బృందంగా కలిసి ఉండడం, చర్చించడం స్తుతి, పూజ, అర్చన, ధ్యానాది సాధనలు చేయడం ఇవన్నీ సద్గోష్టి బృందాలు లేదా సాధక బృందాల లెక్కకు వస్తాయి. ఆ బృందంలో ఎవరైనా సత్ తో సంగం ఉన్నవారు అనగా సత్యాన్ని ఎరిగినవారు ఉంటే అనగా ఒక ఋషి, ముని, హంస, పరమహంస, జ్ఞానంలో పండిన సత్యమెరుక గలవారుంటే అప్పుడు వారితో సంగం కలిగి ఉండడం సత్సంగం ఔతుంది. అలా కాకుండా ఆత్మ ఎరుక లేక, ఆత్మానాత్మ సందిగ్ధంలో ఉంటూ సాధన ప్రయత్నం సాగిస్తున్నవారుంటే అలాటి వారందరూ, అందులో ఉండే పెద్దలైన వేదశాస్త్రేతిహాస విషయ పరిజ్ఞానం ఉన్నవారితో సహా ఉన్నవారందరూ సాధకులే, కొందరు నాలుగుమెట్లు పెనున్నవారు కొందరు మెట్లెక్కడం మొదలెట్టినవారు! అలాంటి బృందాలన్నీ సద్గోష్టి / సాధనా సంగాలే...
-శంకరకింకర


* శిష్యులకు ఋషుల సత్సంగము, వారి సేవ, అవసరమంటారు ?
* వృత్తి రీత్యా నెక్కడో ఉండాలి, సాధువులు సమీపంలో ఉండటం కుదరదు.సత్సంగం లేకపోయినా ,నాకు సాక్షాత్కారం లభిస్తుందా ?
* సత్సంగం అవసరమా ? నేనిక్కడ కు రావటంవల్ల నా కేమైనా ప్రయోజనముంటుందా , ఉండదా - నేను తెలుసుకో గోరేది ఇదే.

మహర్షి !  మొదట సత్సంగం అంటే ఏమిటో తెలుసుకోవాలి నువ్వు. సత్ తో, అంటే  సత్యంతో కలిసి ఉండటమని దాని అర్థం.సత్ ని ఎరిగినవాడినీ,
గ్రహించినవాడినీ, కూడా సత్ అనే అంటారు.సత్ తోగాని, సత్ ని గ్రహించిన వానితో గానీ కలసి ఉండటం అనేది తప్పనిసరి అందరికీ. సంసారసాగరాన్ని  దాటించడానికి  సత్సంగం వంటి నౌక ముల్లోకాలలో వేరే  ఏమీ లేదన్నారు శంకరులు.

    సత్సంగమంటే - సత్ తో  కలసి ఉండటం.సత్ అంటే ఆత్మే. ప్రస్తుతం , ఆత్మే  సత్ అని తెలియకపోవటం వల్ల , ఆ జ్ఞానం కల ఋషి యొక్క సాంగత్యాన్ని  వెతుక్కుంటాం. అదే సత్సంగం. అంతర్ దృష్టి  కలుగుతుంది. సత్ సాక్షాత్కరిస్తుంది.

     !  నీ సహజ స్థితి లో ఉండు !  భగవాన్ శ్రీ రమణ 🌹🌹🌹🌹🌹

Collection from FB

Monday, December 2, 2019

భారత దేశంలో ఎవరుంటారు? భారత అంటే?


భారత దేశంలో ఎవరుంటారు? భారత అంటే?

భరతఖండంలో, భారతదేశంలో ఉండే సనాతనధర్మీయులకి పర్యాయ పదంగా మధ్య ప్రాచ్య, పశ్చిమ దేశాలు పెట్టుకున్నపేరు హిందు. హిందూ పదం ప్రాచీనం కాదు. అది రాజకీయ నామకరణం. సనాతన ధర్మీయులు సత్యాన్ని నమ్ముతారు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఈ దేశంలో వేదాలను నమ్మని చార్వాకులున్నా వారి సిద్ధాంతాన్ని వారు అనుసరించి సత్యాన్వేషణ చేసారు తప్ప మార్చలేదు. భారతీయ జీవన విధానం వేదవిహితమైన సత్యాన్వేషణం. అంటే "భాః, రతః," భాః = కాంతి, వెలుగు, జ్ఞానం దానియందు రతః = రమించేవారు. వారుండే ప్రదేశం భారతదేశం, వారు భారతీయులు. దానికి పర్యాయపదం వచ్చింది, ఇప్పుడు వికృతార్థాలకు తావిస్తున్న "హిందూ" పద (నిజానికి ’భారత’కు) నిర్వచనం.


-శంకరకింకర





Sunday, August 25, 2019

నఱకబడిన చెట్టు మళ్ళీ చిగురిస్తుంది

ఛిన్నోఽపి రోహతి తరుః క్షీణోప్యుపచీయతే పునశ్చన్ద్రః,
ఇతి విమృశన్తస్సన్తః సన్తవ్యన్తేన విప్లుతా లోకే!

నఱకబడిన చెట్టు మళ్ళీ చిగురిస్తుంది, కృష్ణపక్షంలో క్షీణించిన చంద్రుడు మళ్లీ వృద్ధి చెందుతాడు. ధీరులైన సజ్జనులు తమ కష్టాలకు మట్టిముద్దవలె కృంగిపోరు, దుఃఖమును దుఃఖముగా స్వీకరించి దానినధిగమించే ప్రయత్నం చేస్తారు.

-శంకరకింకర
[06/07, 11:49] Self: అసలొకరిని కించపరచడం అన్న భావన వచ్చినప్పుడే, ఆవ్యక్తి తనకు తానుగా కింద పడిపోయినట్లు. పైగా మత్సరంతోటీ, అసూయతోటీ ఉంటే ఎవరు బాగు చేయగలరు. అందుకే పెద్దలంటూంటారు.. రెండో మెట్టు మీదనుంచి జారి పడిపోతే ఇబ్బంది లేదు, 10వ మెట్టు మీదున్నవాడు జారితే కాస్త ప్రమాదం, 100 వ మెట్లు ఆ పై పై మెట్ల పై వాడు జర జరా జారి పడిపోతే.... అదీ భాగవతులు, ధార్మికులు యెడ ఆ ప్రవర్తన అలా ఉంటే... వాడి ఉన్నతి ఇక భగవంతుడే చూడాలి... అది కూడా అనుమానమే... ఏ పూర్వ పుణ్యమో గురువులో అడ్డుపడాలి.

శ్రీకృష్ణున్నాశ్రయిస్తే కలిగేదేమిటి?

శ్రీకృష్ణున్నాశ్రయిస్తే కలిగేదేమిటి?

ఎప్పటికో అప్పటికి
నష్టో మోహః
స్మృతిర్లబ్దః

ఏది నాది నాదనుకుని కూడబెట్టుకున్నావో ఆ మోహం పోతుంది!

ఎవరు నావాళ్లు నావాళ్లనుకున్నావో ఆ మోహం పోతుంది!

నేను, నాది, నావల్ల అన్నీ పోతాయ్, పోలేదంటే కృష్ణుడి అనుగ్రహం కలగలేదన్నట్లే!

ఆనక సంగ నిస్సంగమై మెల్లగా సత్యమూ అవగతమౌతుంది!

*కృష్ణం వందే జగద్గురుం*

Friday, June 14, 2019

పూజారి = పూజ+అరి అంటే "పూజకు శత్రువా"


ఆమధ్య ఎవరో పూజారి అనకూడదు తప్పు పూజారి అంటే పూజకు శత్రువు అన్నారట. అది తప్పుడు అన్వయం, భాష తెలీకపోవడం చేత ఏర్పడిన అయోమయం. పూజారి రెండు పదాల కలయిక కాదు.

అలాగే వంటరి కూడా. "వంటరి" అంటే "వంటచేసేవారు, పాచకుడు" అని నిఘంటు అర్థం. ఇది వృతి పని చేసేవారినుద్దేశించి ఉన్న పేర్లలో ఒకటి.  

కుమ్మరి, పూజారి, కమ్మరి, వంటరి ఇలా ఇవి ఏకపదాలు. ఇవి ఆయా వృత్తులు చేసేవారి పేర్లు.

ముర+అరి = మురారి లాగా ఇవి రెండు పదాల కలయిక కావు.

-శంకరకింకర

Thursday, June 13, 2019

రఘుపతి రాఘవ రాజారాం వక్రీకరణ

పెద్దగీతను చిన్నది చేయాలంటే.. దాని పక్కన ఇంకో పెద్దగీత గీయడం ఒక పద్ధతి. కానీ పెద్ద గీత గీయలేనితనం లేదా విషయంలేక గొప్పదిగా చూపడం కుదరకపోతే? అసలు పెద్దగీతని, గొప్పతనాన్ని చిన్నదిగా చూపడం... అనాదిగా మనిషి బలహీనత.. అదే జరిగిందిక్కడా...

-శంకరకింకర

రఘుపతి రాఘవ రాజారాం వక్రీకరణ

ఈ మాట వింటూనే నోటి వెంబడి పాట వస్తుంది.
రఘుపతి రాఘవ రాజారాం  పతిత పావన్ సీతా రాం
ఈశ్వర్ అల్లా తేరో నామ్ సబ్ కో సన్మతి దే భగవాన్
నిజానికి ఇది మన జాతి పితగా వ్యవహరింపబడే గాంధీ గారు అసలు భజనను మార్చి వ్రాసినది. ఇది భారతీయులందరి కొరకు వ్రాసినది అని చెబుతారు. విష్ణు దిగంబర్ పాలుస్కర్ గారు దీనిని పాడి ప్రచారములోనికి తెచ్చినారు. దీనికి మూలమగు భజన రచయిత మరుగున పడిపోయినారు, కానీ దీనిని హిందువులు తప్ప అన్యులు పాడుట అరుదు. ఇందులో క్రీస్తు పేరు లేదని క్రైస్తవులు పాడరు. రాముని పేరు వుందని ముస్లిములు పాడరు. మరి గాంధీ గారు ఎవరి కొరకు వ్రాసినారన్నది మీ ఊహకు వదులుతాను.

అసలు ఈ భజన పుట్టుపూర్వోత్తరములకు పోతే దీని మొదటి రెండు చరణములు నామరామాయణములోనివి. ఈ రెండు చరణములతో లక్ష్మణాచార్య గారు ఈ క్రింది భజనను వ్రాసినారు. చదువుతూ వుంటే అర్థమగుట లేదా లక్ష్మణాచార్యులవారు తెలుగువారని. ఎందుకంటే ఈ చిన్న భజనలో మన భద్రాద్రి రాముడు చోటు చేసుకొన్నాడు.

రఘుపతి రాఘవ రాజారాం
పతిత పావన సీతా రాం
సుందర విగ్రహ మేఘశ్యాం
గంగా తులసీ సాలగ్రాం
భద్రగిరీశ్వర సీతారాం
భక్త జనప్రియ సీతారాం
జానకి రమణా సీతారాం
జయ జయ రాఘవ రాజారాం 

-చెరుకు రామ మోహన్ రావు, Cheruku Rama Mohan Rao (Saturday, 23 December 2017)

Tuesday, June 11, 2019

అఙ్గారకస్తోత్రమ్

॥ అఙ్గారకస్తోత్రమ్ ॥

అస్య శ్రీ అఙ్గారకస్తోత్రస్య ।
విరూపాఙ్గిరస ఋషిః ।
అగ్నిర్దేవతా ।
గాయత్రీ ఛన్దః ।
భౌమప్రీత్యర్థం జపే వినియోగః ।
అఙ్గారకః శక్తిధరో లోహితాఙ్గో ధరాసుతః ।
కుమారో మఙ్గలో భౌమో మహాకాయో ధనప్రదః ॥ ౧॥

ఋణహర్తా దృష్టికర్తా రోగకృద్రోగనాశనః ।
విద్యుత్ప్రభో వ్రణకరః కామదో ధనహృత్ కుజః ॥ ౨॥

సామగానప్రియో రక్తవస్త్రో రక్తాయతేక్షణః ।
లోహితో రక్తవర్ణశ్చ సర్వకర్మావబోధకః ॥ ౩॥

రక్తమాల్యధరో హేమకుణ్డలీ గ్రహనాయకః ।
నామాన్యేతాని భౌమస్య యః పఠేత్సతతం నరః ॥ ౪॥

ఋణం తస్య చ దౌర్భాగ్యం దారిద్ర్యం చ వినశ్యతి ।
ధనం ప్రాప్నోతి విపులం స్త్రియం చైవ మనోరమామ్ ॥ ౫॥

వంశోద్ద్యోతకరం పుత్రం లభతే నాత్ర సంశయః ।
యోఽర్చయేదహ్ని భౌమస్య మఙ్గలం బహుపుష్పకైః ॥ ౬॥

సర్వా నశ్యతి పీడా చ తస్య గ్రహకృతా ధ్రువమ్ ॥ ౭॥

॥ ఇతి శ్రీస్కన్దపురాణే అఙ్గారకస్తోత్రం సంపూర్ణమ్ ॥

కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి

Collection.. from whatsapp


న మంత్రం నో యంత్రం తదపి చ న జానే స్తుతి మహో
న చాహ్వానం ధ్యానం తదపి చ న జానే స్తుతి కథాః
న జానే ముద్రాస్తే తదపి చ న జానే విలపనం
పరం జానే మాతస్త్వదనుసరణం క్లేశహరణమ్ || ౧ ||

అమ్మానాకు మంత్రాలు తెలియవు,యంత్రాలు తెలియవు. నిన్ను స్తుతిచేసే మతిలేదు. నాకు నిన్నుపాసన చేసే ముద్రలు తెలియవు. ఇవియన్నీ నా బాధలు అని చెప్పుకొని ఏడ్వలేను. నాకు తెలిసినది ఒకటే. నిన్ననుసరించుటయే నా దుఃఖములకు ఉపశమనము.

విధేరజ్ఞానేన ద్రవిణ విరహేణాలసతయా
విధేయా శక్యత్వాత్తవ చరణయోర్యాచ్యుతిరభూత్
తదేతత్ క్షంతవ్యం జనని సకలోద్ధారిణి శివే
కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి || ౨ ||

నా అజ్ఞానముచేత, అశక్తతచేత, నా సోమరితనము చేత, నా దౌర్బల్యముచేత, నేను పెట్టదలచిన నైవేద్యము నీ పాదములనంటినది. తల్లీ శివా, భవానీ, రుద్రాణీ నన్ను క్షమించు.అందరినీ ఉద్ధరించే తల్లీ నీకు తెలియనిదేమున్నది. చెడ్డ కుమారుడు ఉండటం లోక సహజము కానీ చెడ్డ తల్లి ఉండదు కదా!

పృథివ్యాం పుత్రాస్తే జనని బహవః సంతి సరళాః
పరం తేషాం మధ్యే విరల విరలోzహం తవ సుతః
మదీయోzయం త్యాగః సముచిత మిదం నో తవ శివే
కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి || ౩ ||

అమ్మా అనేకానేకమైన నీ సుపుత్రుల నడుమ,నాది,నాకు అన్న స్వార్థ పూరిత వాంఛలచే పెనుగొనబడి శమ దమాదులను అధిగమించలేక పడియున్నాను.నాకున్న ఒకేఒక అర్హత నీ కుమారుని కావటమే. తల్లీ శివా! అదిచాలదా నన్ను ఉద్ధరించుటకు. అయినా చెడ్డ కుమారుడు ఉండటం లోక సహజము కానీ చెడ్డ తల్లి ఉండదు కదా!

జగన్మాతర్మాతస్తవ చరణ సేవా న రచితా
న వా దత్తం దేవి ద్రవిణమపి భూయస్తవ మయా
తథాపి త్వం స్నేహం మయి నిరుపమం యత్ప్రకురుషే
కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి || ౪ ||

అమ్మా! జగన్మాతలకు మాతా! నీ పాదసేవ నేను చేసినదేలేదు. నీ పద సన్నిధిన నేనుంచిన నైవేద్యము ఏమీ లేదు. నిరుపమానమైన నీ కనికరమునకు నీ పుత్రుని నుండి అవి నీకు కావలెనా. అయినా చెడ్డ కుమారుడు ఉండటం లోక సహజము కానీ చెడ్డ తల్లి ఉండదు కదా!

పరిత్యక్తా దేవా వివిధ విధ సేవాకులతయా
మయా పంచాశీతేరధిక మపనీతే తు వయసి
ఇదానీం చేన్మాతస్తవ యది కృపా నాzపి భవితా
నిరాలంబో లంబోదరజనని కం యామి శరణమ్ || ౫ ||

అమ్మా! 85సంవత్సరముల వయసు వచ్చినా నాకు ఏవిధమైన పూజా విధానాలూ తెలియవు. నేను చేయ గలిగినది నీ శరణు కోరడమే. ఎటువంటి ఆశ్రయముమూ లేని నాకు నీవు కాక ఆశ్రయము వేరేవ్వరివ్వగలరు ఓ లంబోదరజననీ!

శ్వపాకో జల్పాకో భవతి మధుపాకోపమగిరా
నిరాంతంకోరంకో విహరతి చిరం కోటికనకైః
తవాపర్ణే కర్ణే విశతి మను వర్ణే ఫలమిదం
జనః కో జానీతే జనని జపనీయం జప విధౌ || ౬ ||

తల్లీ అపర్ణా! నీమహిమనేమని కొనియాడను. నీ మహిమతో చండాలుడు కూడా మదుర మధురతర మంజుల వాణిని వినిపించగలడు, నిర్ధనుడు కూడా ధనవనమున ధాటిగా నడయాడగలడు, కేవలము నీ నామామృతము వారి కర్ణ రంధ్రములు సోకినచాలును.మరి అంత మహిమగల నీ నామము అనుష్టాన నియమములతో అకుంఠితముగా జపించే వారి అదృష్టమును ఏమని కొనియాడవలెను.

చితాభస్మాలేపో గరళమశనం దిక్పటధరో
జటాధారీ కంఠే భుజగపతిహారీ పశుపతిః
కపాలీ భూతేశో భజతి జగదీశైకపదవీం
భవానీ త్వత్పాణిగ్రహణ పరిపాటీఫలమిదమ్ || ౭ ||

అమ్మా చితాభస్మమును ధరించువాడు, విషమును కంఠమునందు దచుకున్నవాడు, దిక్కులనే వస్త్రములుగా ధరించినవాడు, జడలు కట్టినవాడు, పాములను ధరించిన వాడు, భుతములతో తిరుగాడువాడు, కపాలములో భుజించువాడు అయిన శివుడిని జగత్ప్రభువు అనుటకు  కారణము నీవాయన అర్దాగివి అగుట వల్లనే కదా అమ్మా!

న మోక్షాస్యాకాంక్షా న చ విభవవాంఛాపి చ న మే
న విజ్ఞానాపేక్షా శశిముఖి! సుఖేచ్ఛాపి న పునః
అత స్త్వాం సంయాచే జనని జననం యాతు మమ వై
మృడానీ రుద్రాణీ శివ శివ భవానీతి జపతః || ౮ ||

అమ్మా నేను ధన,కనక,వస్తు,వాహన కామినీ కాదు మోక్షగామినీ కాదు,శాస్త్రజ్ఞత కూడా నాలో శూన్యమే.తల్లీ ఇందుముఖీ నాకు ఏ సుఖ సంతోషాలూ వద్దు. నాకు నీవెన్నిజన్మలు కలిగించ బోవుచున్నా అన్ని జన్మలలోనూ నాకు నీ నామములైన "మృడాని,రుద్రాణి,శివా,భవానీ" మొదలయిన వీనినే నేను సదా స్మరించు నటుల చేయి వరంబునీయుము తల్లీ.

నారాధితాసి విధినా వివిధోపచారైః |
కిం సూక్ష్మచింతనపరైర్న కృతం వచోభిః ||
శ్యామే! త్వమేవ యది కించన మయ్యనాథే |
ధత్సే కృపాముచితమంబ పరం తవైవ || ౯ ||

అమ్మా శ్యామా! నేను వేదచోదితమైన మంత్రపఠనముతో, ఉదాత్తానుదాత్త స్వరములతో,అచంచలమైన భక్తితో నిన్ను కోలుచుటలేదు. నాకుతెలిసినదల్లా నా భాషలో నా ఘోష వినిపించడమే.అయినా నన్ను నీ అక్కున చేర్చుకోన్నావంటే నవనీత హృదయముతో కూడిన నీవు నా హృదయావేదన గుర్తిన్చినావు. నీవు ఈ జగత్తుకే అతీతురాలివి కదా.

ఆపత్సుమగ్నస్స్మరణం త్వదీయం | కరోమి దుర్గే కరుణార్ణవే శివే |
నైతచ్ఛఠత్వం మమ భావయేథాః | క్షుధాతృషార్తా జననీం స్మరంతి || ౧౦ ||

అమ్మా దుర్గా! దయా సాగరీ! ఆపదలలో మాత్రమే నిన్ను తలచుతానని "అవసరార్థి నైన" నన్ను అసహ్యించుకోవద్దు. బిడ్డకు ఆకలైతే తలచుకోనేది తల్లినేకదా!

జగదంబ విచిత్ర మత్ర కిం పరిపూర్ణా కరుణాస్తి చే న్మయి |
అపరాధపరంపరావృతం న హి మాతా సముపేక్షతే సుతమ్ || ౧౧ ||

అమ్మా జగన్మాతా! నీవు పోతపోసిన కరుణా మూర్తివి. ఇందులో ఆశ్చర్యమేమీ లేదు.అందుకే తనయుడనైన  నా తప్పులెన్నున్నా తప్పనిసరిగా నన్నుపేక్షింపక నీ అక్కున చేర్చుకొంటావు అమ్మా!

మత్సమః పాతకీ నాస్తి పాపఘ్నీ త్వత్సమా న హి |
ఏవం జ్ఞాత్వా మహాదేవీ యథా యోగ్యం తథా కురు || ౧౨ ||

నేనే అధమాధముడను.నాకన్నా అధములు వుండరు కదా.
నాకు మాత్రమే మంచి జరగాలి అనుకుంటు దాని వలన లోకానికి ఎంత కీడు జరుగుతుందో ఆలోచించనివాడిని, ఏది కోరుకోవాలో కూడా తెలియని వాడిని.
అన్నీ తెలిసినా నీవు ఏది యోగ్యమో అది అందజేయు నీకు వందనములు.

బిందు త్రికోణ వసుకోణ దశారయుగ్మ
మన్వస్త్ర నాగదళ షోడశపత్ర యుక్తం
వృత్తత్రయంచ ధరణీ సదన త్రయంచ
శ్రీ చక్ర రాజ ఉదితః పరదేవతాయాః