Pages

Saturday, June 8, 2019

ఆధ్యాత్మ & కుటుంబ రాజకీయం

రాజకీయం ఒక వృత్తిగా స్వీకరించవచ్చు. కానీ, ఆఫీసుల్లో, స్కూళ్లలో, సంఘాలలో ప్రైవేటు విషయాలో రాజకీయం చేయడం అనేది పరమ చిరాకు విషయం. భగవదనుగ్రహంతో అలాంటి విషయాలను, వ్యక్తులను కనీసం నాదాకా రాకుండానే, వస్తూంటెనే ఆమడ దూరంలోనే నిలువరించగలిగాను.

ఐతే, ఆధ్యాత్మిక సంస్థలలో, ఆధ్యాత్మ వ్యక్తులమధ్య, కుటుంబ సభ్యుల మధ్య రాజకీయాలు చోటుచేసుకోవడం పరమ దారుణమైన విషయాలు. ఈ విషయాలలో రాజకీయం, కుట్రలు, చాడీలు పరమ అసహ్యకరమైన విషయాలు... మొగ్గలో ఉన్నప్పుడే తుంచాలి లేదా దూరంగా జరగాలి. అలా చేయలేకపోవడం ఆ కుటుంబ పెద్ద, ఆ సంస్థ పెద్ద యొక్క అసమర్థతగానే ఎంచాల్సి ఉంటుంది, నిస్సందేహంగా !

-శంకరకింకర

Saturday, June 1, 2019

దుర్వాస మహర్షి



(Whatsapp Collection, do not know the original author)
దుర్వాస మహర్షి, కంచి కామాక్షీ అమ్మవారి ఆలయంలో అనేక మంది భక్తులకి వారు ప్రత్యక్ష  దర్శనం ఇచ్చి అనుగ్రహించారు. కామాక్షీ అమ్మవారికి చందనోత్సవం చేసినప్పుడు ఇప్పటికీ, అమ్మవారి కుడి వైపు దుర్వాస మహర్షిని చూడవచ్చని, ఆ దర్శనం చేయగలిగిన సత్పురుషులకు వారు కనబడతారని పెద్దల విశ్వాసం. ఎంతో మంది శ్రీవిద్యోపాసకులకు దుర్వాసో మహర్షి ఆరాధ్య దైవం మరియు సద్గురువు. గురువు నుండి పొందిన శ్రీవిద్యా మంత్రాలు, ఏ కొంచెమైనా కూడా, పూనికతో కామాక్షీ ఆలయంలో అనుష్ఠిస్తే, వారికి తప్పకుండా దుర్వాసో మహర్షి అనుగ్రహం లభిస్తుందనీ, వారికి ఆయనే ఉపాసనలో ముందుకు నడిపించే దిశానిర్దేశం చేస్తారనీ ఎంతో మంది భక్తుల అనుభవం. 

దీనికి ఉదాహరణ, తమిళనాడులోని తిరుచిరాపల్లిలో మీనాక్షీ అమ్మళ్ అని ఒక తల్లి ఉండేది. ఆమెకి చాలా చిన్న వయసులోనే ఆమె మామగారే గురువై శ్రీవిద్యా దీక్ష ఇచ్చారు. అయితే, ఆమె ఎన్నో రోజులు సాధన చేయకమునుపే, ఆ గురువు (ఆమె యొక్క మావగారు) తనువు చాలించారు. అప్పటికి ఆ తల్లికి శ్రీవిద్యోపాసనలో ఇంకా సాధనాబలం లేదు. ఆమెకి గురువు గారు ఇచ్చిన మూలమంత్రము ఒక్కటే తెలుసు.

ఆమె ఆ మూలమంత్రమునే భక్తితో కొంత కాలం సాధన చేసింది. అయితే ఆమె తరచుగా తిరువారూర్ లో ఉన్న కమలామ్బికా అమ్మవారి క్షేత్రములో కూర్చుని ఆ మంత్ర జపము చేసేది. ఒకనాడు, అదేవిధముగా ఆ ఆలయములో జపం చేస్తూ ఉంటే, మంచి స్ఫురద్రూపి అయిన ఒక వృధ్ధుడు ఆమె యెదుటకి వచ్చి, నువ్వు కంచిలోని శ్రీవిద్యా పరమేశ్వరీ అమ్మవారి సన్నిధికి (అంటే కామాక్షీ అమ్మయే) వెళ్ళు, అక్కడ నీవు చేసే మంత్ర జపమునకు న్యాసము (కరన్యాసము, అంగన్యాసము) కూడా దొరుకుతుంది అని చెప్పి వెళ్ళిపోయారు. ఆమె వెంటనే కంచి కామాక్షీ అమ్మవారి సన్నిధికి వెళ్ళింది. ఆశ్చర్యంగా ఆమెకి ఇక్కడ కూడా అదే వృధ్ధుడు దర్శనమిచ్చి, అక్కడ అమ్మ వారి ప్రాంగణములోనే ఉన్న మరొకరిని చూపించి ఆయనని ఆశ్రయించమని చెప్పారు. వెంటనే ఆ తల్లి పరుగు పరుగున వెళ్ళి వారి పాదములకు నమస్కారం చేసి, జరిగినదంతా చెప్పింది.

ఆ పెద్ద మనిషి మైసూర్ కు చెందిన శ్రీ యజ్ఞనారాయణ శాస్త్రి అనే ఒక గొప్ప శ్రీవిద్యోపాసకుడు. శాస్త్రి గారు, నేను నీకు ఎలా తెలుసమ్మా అని ఆవిడని అడిగితే, ఆ తల్లి వెనుకకు తిరిగి, అక్కడ నిల్చున్న వృధ్ధుడిని చూపించింది. విచిత్రముగా, ఆ వృధ్ధుడు శాస్త్రి గారు, ఆ తల్లి ఇద్దరూ చూస్తుండగా అంతర్ధానం చెందారు. తదుపరి ఆ తల్లి కామాక్షీ ఆలయంలో ప్రదకక్షిణ చేస్తూ ఉండగా, దుర్వాస మహర్షి సన్నిధికి వచ్చి నమస్కరించగానే, అక్కడ అంతర్ధానం చెందిన వృధ్ధుడే దుర్వాస మహర్షి మూర్తి యందు కనబడి, ఆమెను దీవించారు. ఇది నిత్య సత్యమైన లీల. ఇప్పటికీ ఆ తల్లి ప్రతీ యేటా కంచి వెళ్ళి అమ్మ దర్శనముతో పాటు, దుర్వాస మహర్షి యొక్క దర్శనము కూడా పొందుతారు.

Tuesday, May 28, 2019

గొప్ప వ్యక్తి, గొప్పతనం

ఒక వ్యక్తి గొప్పవ్యక్తి అవడానికీ,
గొప్పవ్యక్తిగా అభివర్ణింపబడడానికీ హస్తిమశకాంతర బేధం ఉంది.

అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది. గొప్పతనం, ఆభిజాత్యం అనే బుడగ పగులుతుంది. నిజమైన గొప్పవ్యక్తులే గొప్పవారిగా కీర్తింపబడతారు.


(భుజాలు తడుముకోవద్దు... LoL)

ఉదాః- కాంగ్రెస్, సెక్యులర్ నేతలనే దశాబ్దాలుగా గొప్పవారుగా చిత్రీకరింపబడ్డారు, వాళ్ల వ్యక్తిత్వాలకతీతంగా, కాంగ్రెసేతర స్వాతంత్ర్య సమరయోధులు, ముఖ్యంగా మేరునగధీరులైన సనాతన ధర్మానుయాయులను అసలు లక్ష్యపెట్టలేదు.


-శంకరకింకర

Saturday, May 25, 2019

సర్వత్ర భయం! భయం! భయం!

సంపాదించిన ధనం ఎవరిపాలోనని భయం,

సాధించిన కీర్తి  పాడౌతుందేమోనని భయం,

సాంగత్యమున్న జనంలో ఎవడు దెబ్బేస్తాడోనన్నం భయం.

సర్వత్ర భయం! భయం! భయం!

అందుకే తేనెటీగ లాంటి బ్రతుకొద్దని తేనెటీగనిచూసి నేర్చుకున్నానని చెప్పాడు అజగరుడు ప్రహ్లాదుడితో...

ధనం, జనం, యశం తో మమేకమవకుండా *సత్యం* తో మాత్రమే మమేకమై బ్రతకమని బోధించాడు.

- శంకరకింకర

Wednesday, May 22, 2019

ప్రహ్లాదుని ధృతి

''ఎవని బలమున నీవు నేను చెప్పిన మాట వినక అతిక్రమించుచున్నావు?'' అని అడుగగా, 

''ఏ భగవంతుడు ఈ జగమును సృజించి పాలించుచున్నాడో, అతని బలముననే ఇట్లు ప్రవర్తించుచున్నాను. అంతః శత్రువులను గెలువలేక ప్రపంచమంతనూ గెలువ గల్గితినని తలంచుట భ్రాంతి. గనుక అంతఃశత్రువులను జయించుడు'' అని ప్రహ్లాదుడు తండ్రికి విన్నవించెను.


ఆహా ఏమి ధృతి అదికదా కావలసినది. ఎంతమంది బలగం ఉన్నా, అఖండైశ్వర్యం, త్రిలోకాధిపతిఅనే కీర్తి... ప్చ్ ఎన్ని ఉన్నా హిరణ్యకశిపుడు ఏమీలేనివాడే... అర్భకుడు, బాలకుడు అనుకున్న ప్రహ్లాదుడు అన్నీ ఉన్నవాడే!


-శంకరకింకర

Saturday, May 18, 2019

శ్రీ కూర్మనాథ జయంతి - తత్త్వం

సముద్రంలో ఇతర జలాలో ఉండే తాబేలు తను అటూ ఇటూ వెళ్లడానికి సంసార వ్యాపారానికి గానూ కాళ్లూ చేతులు బయటపెట్టి కదిలిస్తుంది. ఆ గమనం అవసరం లేనప్పుడు వాటిని తాబేటి డిప్పలోకి లాగేస్కుంటుంది.

ఇది ఆధ్యాత్మిక సాధనలో విషయ సుఖాలనుంచి ఇంద్రియాలను వెనక్కు మరల్చడమనే స్థితికి ప్రతీక. ఎంత గొప్ప స్థితికి చేరితే అంత లోపలికి లాక్కోవాలి. ఎంత పెరిగితే అంత ఒదగాలి, సముద్ర స్వరూపమైన ప్రపంచ సంసార వ్యాపారం నుండి తగ్గాలి ధన,జన,బల,కీర్తి మున్నగు లౌకిక విషయాలనుండి తగ్గి బహిర్ముఖ ప్రవృత్తిని అంచెలంచెలుగా ఆపి అంతర్ముఖ ప్రవృత్తిలోకి వెళ్లగలిగే చిత్తవృత్తి రూప ప్రజ్ఞకు శ్రీ కూర్మనాథ రూపం ప్రతీక.

-శంకరకింకర

Saturday, May 11, 2019

ధర్మం భూషణం కారాదు

ధర్మం భూషణం కారాదు, అది తీసి పక్కనపెట్టేసేది కాదు.

ధర్మం గుణం కావాలి. జీర్ణమైపోవాలి అప్పుడే జీవుడు ధర్మాత్ముడౌతాడు, తద్వారా ధర్మి ఔతాడు.

వాచావేదాంతం వలె వాచా ధర్మం కూడా అప్రయోజనకారి.

ధర్మ భాషణం కన్నా ధర్మాచరణం ప్రభావవంతం, ఉన్నతం.

-శంకరకింకర

Friday, May 10, 2019

ధర్మాచరణం

ధర్మాన్ని ఆచరించడం
ఆచరించినదానికి ధర్మాన్ని తోడు తెచ్చుకోవడం చేసింది ధర్మమే అని కలరిచ్చుకోవడం❌

Tuesday, April 30, 2019

నవగ్రహ కరావలమ్బస్తోత్రమ్

!! నవగ్రహ కరావలమ్బస్తోత్రమ్ !!

జ్యోతీశ దేవ భువనత్రయ మూలశక్తే
గోనాథ భాసుర సురాదిభిరీద్యమాన !
నౄణాంశ్చ వీర్య వర దాయక ఆదిదేవ
ఆదిత్య వేద్య మమ దేహి కరావలమ్బమ్ !! ౧!!

నక్షత్రనాథ సుమనోహర శీతలాంశో
శ్రీ భార్గవీ ప్రియ సహోదర శ్వేతమూర్తే !
క్షీరాబ్ధిజాత రజనీకర చారుశీల
శ్రీమచ్ఛశాంక మమ దేహి కరావలమ్బమ్ !! ౨!!

రుద్రాత్మజాత బుధపూజిత రౌద్రమూర్తే
బ్రహ్మణ్య మంగల ధరాత్మజ బుద్ధిశాలిన్ !
రోగార్తిహార ఋణమోచక బుద్ధిదాయిన్
శ్రీ భూమిజాత మమ దేహి కరావలమ్బమ్ !! ౩!!

సోమాత్మజాత సురసేవిత సౌమ్యమూర్తే
నారాయణప్రియ మనోహర దివ్యకీర్తే !
ధీపాటవప్రద సుపండిత చారుభాషిన్
శ్రీ సౌమ్యదేవ మమ దేహి కరావలమ్బమ్ !! ౪!!

వేదాన్తజ్ఞాన శ్రుతివాచ్య విభాసితాత్మన్
బ్రహ్మాది వన్దిత గురో సుర సేవితాంఘ్రే !
యోగీశ బ్రహ్మ గుణ భూషిత విశ్వ యోనే
వాగీశ దేవ మమ దేహి కరావలమ్బమ్ !! ౫!!

ఉల్హాస దాయక కవే భృగువంశజాత
లక్ష్మీ సహోదర కలాత్మక భాగ్యదాయిన్ !
కామాదిరాగకర దైత్యగురో సుశీల
శ్రీ శుక్రదేవ మమ దేహి కరావలమ్బమ్ !! ౬!!

శుద్ధాత్మ జ్ఞాన పరిశోభిత కాలరూప
ఛాయాసునన్దన యమాగ్రజ క్రూరచేష్ట !
కష్టాద్యనిష్ఠకర ధీవర మన్దగామిన్
మార్తండజాత మమ దేహి కరావలమ్బమ్ !! ౭!!

మార్తండ పూర్ణ శశి మర్దక రౌద్రవేశ
సర్పాధినాథ సురభీకర దైత్యజన్మ !
గోమేధికాభరణ భాసిత భక్తిదాయిన్
శ్రీ రాహుదేవ మమ దేహి కరావలమ్బమ్ !! ౮!!

ఆదిత్య సోమ పరిపీడక చిత్రవర్ణ
హే సింహికాతనయ వీర భుజంగ నాథ !
మన్దస్య ముఖ్య సఖ ధీవర ముక్తిదాయిన్
శ్రీ కేతు దేవ మమ దేహి కరావలమ్బమ్ !! ౯!!

మార్తండ చన్ద్ర కుజ సౌమ్య బృహస్పతీనామ్
శుక్రస్య భాస్కర సుతస్య చ రాహు మూర్తేః !
కేతోశ్చ యః పఠతి భూరి కరావలమ్బ
స్తోత్రమ్ స యాతు సకలాంశ్చ మనోరథారాన్ !! ౧౦!!

     !! ఓం శాన్తిః శాన్తిః శాన్తిః !!