విద్యా జ్ఞాన సుధాపూర్ణామ్
వేదాంతాద్వైత భాషిణీమ్
సరస్వతీమహం వందే
హ్యమృతానంద రూపిణీమ్..
1. వారాహీ తంత్రం:
గోపనీయం ప్రయత్నేన మంత్రం చాష్టముఖం పరం।
గోపనీయా విశేషేణ దండినీ పరమేశ్వరీ॥
ఆష్టముఖి (వారాహీ) మంత్రాన్ని విశేషంగా రహస్యంగా, కచ్చితంగా గోప్యతతో చేయాలి. దండిని దేవి అనగా వారాహీ – ఆమె ఉపాసనను గోపనీయంగా ఉంచాలి.
2. బృహద్గాంధర్వతంత్రం:
రాత్రౌ కార్యం విశేషేణ మంత్రసిద్ధిర్న దీపకే।
గోప్యం గుప్తతరం కార్యం సర్వతో విజనే స్థలే॥
ఈ ఉపాసనను రాత్రి చేయాలి, దీపం వెలిగించకుండా. మంత్రసిద్ధి కోసం ఇది అత్యంత గోప్యంగా చేయాలి. ఇది నిశ్శబ్ద, ఒంటరిగా ఉండే ప్రదేశంలో నిర్వహించాలి.
3. వారాహీ రహస్యం:
న ప్రకాశ్యం పరేభ్యశ్చ న మంత్రం న విధానకం।
న యజ్ఞం న చ పూజాం వా మంత్రసిద్ధిర్న జాయతే॥
వారాహీ మంత్రాన్ని, విధానాన్ని, పూజను ఇతరులకు చెప్పకూడదు. అలా చేస్తే మంత్రసిద్ధి సంభవించదు.
4. శక్తిసంగమతంత్రే:
గోపనీయతమం కార్యం వారాహీ సాధకైః సదా।
గృహే చ న ప్రకాశితం కులవృత్తం యథా స్వయం॥
వారాహీ ఉపాసనను ఉపాసకులు అత్యంత గోపనీయంగా నిర్వహించాలి. ఇది కుటుంబ రహస్యంగా గౌరవించాలి, బయట వ్యక్తీకరించరాదు.
5. వారాహీ తంత్రవాక్యం:
గుహ్యే గుహ్యతరం కార్యం వారాహీపూజనం సదా।
న వక్తవ్యం కదాచిత్ తు స్వప్నేఽపి పరచేతనం॥
వారాహీ పూజ అనేది అత్యంత రహస్యంగా చేయవలసిన విధి. ఇది స్వప్నంలోనూ ఇతరులకు చెప్పకూడదు
- శ్రీ చిర్రావూరిగారి సేకరణ
శ్రీ తాడేపల్లి పతంజలి గారి ఫేస్బుక్ పోస్ట్
వేదాధ్యయనం చెయ్యకూడని రోజుల్ని అనధ్యయనాలంటారు. మార్గశీర్షం బహుళ సప్తమి, పుష్యమాసం బహుళాష్టమి, మాఘమాసం బహుళనవమి, ఫాల్గుణం బహుళ దశమి, భాద్రపదం బహుళైకాదశి - వీటిని అష్టకాలంటారు.
ఈ తిధుల్లో వేదాధ్యయనం చెయ్యకూడదు.
ప్రతినెలా అష్టమి చతుర్ధశి పూర్ణిమ అమావాస్యలూ మకర కర్కాటక రవి సంక్రాంతులూ - వీటిని పంచపర్వాలంటారు. ఇవికూడా అనధ్యయన దివసాలే.
ఇంకా ఇలాగే ప్రతీపాడ్యమి, భాద్రపద కృష్ణపక్షంలో మహాభరణి (ఆషాడం), ఉత్థాన ద్వాదశీ (కార్తికం), ఆషాడ - కార్తిక - ఫాల్గుణాల్లో శుక్ల పక్ష ద్వితీయులు, మాఘశుద్ధ సప్తమి, అశ్వయుజ శుద్ధ నవమి - ఈ తిథులు వేదాధ్యయనానికి అనర్హాలు. అంటే అనధ్యయన దివసాలు.